Movie News

వయొలెంట్ పోలీసోడిగా అల్లరోడు

మహేష్ బాబు మహర్షిలో చేసిన పాత్ర అల్లరి నరేష్ కథల ఎంపికలో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చింది. నాంది విజయం దానికి మరింత ఊతమిచ్చింది. తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ మంచి ప్రయత్నమనే పేరు వచ్చింది. ఇప్పుడు తిరిగి నాంది దర్శకుడు విజయ్ కనకమేడలతో చేతులు కలిపి ఉగ్రంతో వస్తున్నాడు. మే 5న విడుదల కాబోతున్న ఈ సినిమాలో నరేష్ చాలా వయొలెంట్ గా ఫెరోషియస్ గా నటించాడు. ట్రైలర్ చూశాక గతంలో ఎన్నడూ చూడని తీవ్రత కళ్ళలోనే కాదు యాక్టింగ్ లోనూ కనిపిస్తోంది

ఏదీ దాచకుండా స్టోరీ మొత్తం ఓపెన్ గా చెప్పేశారు. నగరంలో వరస కిడ్నాప్ లు జరుగుతుంటాయి. ఎక్కువగా మహిళలు చిన్న పిల్లల జాడ తెలియక వేలు లక్షల్లో తల్లితండ్రులు తల్లడిల్లిపోతుంటారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేసే శివకుమార్(అల్లరి నరేష్) ఆ ముఠాల బారిన పడి భార్యా బిడ్డను పోగొట్టుకుంటాడు. వాళ్ళను అన్వేషించే క్రమంలో ఇదంతా ఒకరిద్దరు చేస్తున్నది కాదని పెద్ద తలకాయలు ఉన్నాయని గుర్తిస్తాడు. ఇతన్ని అడ్డుకుకే ప్లాన్ లో భాగంగా మాఫియా వేసిన స్కెచ్ లో ఓ అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. ఛాలెంజ్ చేసి మరీ వాళ్ళ ఆట కట్టించేందుకు సిద్ధపడతాడు.

చాలా హై ఇంటెన్సిటి డ్రామాగా విజయ్ ఉగ్రంని తీర్చిదిద్దాడు. గతంలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వచ్చినప్పటికీ డెప్త్ విషయంలో నరేష్ మూవీ డిఫరెంట్ గా అనిపిస్తోంది. ఇంత ఓపెన్ గా వివరించారంటే ఈ వీడియోలో లేని చాలా ట్విస్టులు తెరమీద సర్ప్రైజ్ చేయబోతున్నాయన్న మాట. అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చిన ఉగ్రంకు శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. మే 5 గోపీచంద్ రామబాణంతో పాటుగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. చూస్తుంటే అల్లరి నరేష్ దగ్గర్లో కామెడీ జానర్ జోలికి వెళ్లేలా లేడు. పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే కంటెంట్ నే ఎంచుకుంటున్నాడు

This post was last modified on April 22, 2023 11:18 am

Share

Recent Posts

నాని జడల లుక్… అందరూ వద్దే వద్దన్నా

టాలీవుడ్ దర్శకుల్లో కొత్త కథలతో ప్రయాణం చేస్తూ, ఒక కన్విక్షన్‌తో సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ పేరు ముందు వరుసలో…

5 hours ago

ఎగతాళి చేస్తారని ఆ విషయం దాచేసిన సందీప్ కిషన్

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయాడు విజయ్.…

5 hours ago

లైవ్ లోనే టీ-షర్ట్ విప్పేసిన సల్మాన్ ఖాన్

నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ఎక్కడ చూసినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వీడియోనే…

6 hours ago

విద్యార్థినుల సింగిల్ జడలు కత్తిరించింది ఎవరు?

ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ హాస్టల్ లో నిద్రస్తున్న విద్యార్థినుల జడలు కత్తిరించడం కలకలం రేపింది. కేవలం సింగిల్ జడ…

6 hours ago

నిన్న మల్లెపూల పల్లకి… రేపు రఘుకుల తిలకా రారా

ఫిలిం ఇండ‌స్ట్రీలో ఒక సినిమా పెద్ద హిట్ట‌యిందంటే.. ఆ చిత్రానికి క‌లిసొచ్చిన పాయింట్లేంటో చూసుకుని… ఆ అంశాలు త‌మ చిత్రాల్లో…

6 hours ago

హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్.. చిరు మాస్టర్ ప్లాన్

వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ మన హైదరాబాద్‌కు రాబోతోందనే వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. టాలీవుడ్ స్టార్…

9 hours ago