Prabhas
సరిగ్గా వారం రోజుల్లో ఏజెంట్ వచ్చేస్తాడు. అఖిల్ దాదాపు నిద్రాహారాలు మానేసిన రేంజ్ లో ప్రమోషన్ల కోసం కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతున్నాడు. కాకినాడలో కేవలం పోస్టర్ లాంచ్ కోసమే 172 అడుగుల పై నుంచి తాళ్లు కట్టుకుని దూకడం చూసి ఫ్యాన్సే షాక్ తిన్నారు. ఇప్పుడు అందరి కళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద ఉన్నాయి. దీనికో స్పెషల్ గెస్ట్ కావాలి. డార్లింగ్ ప్రభాస్ ని అడగ్గానే అంగీకారం తెలిపినట్టు సమాచారం. హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించబోయే ఈ వేడుక తర్వాత హైప్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోతుందని నిర్మాత అనిల్ సుంకర ధీమా.
ఈవెంట్ ప్లేస్, సమయం అన్నీ ఇవాళో రేపో పూర్తి వివరాలతో ప్రకటించబోతున్నారు. ప్రభాస్ రాకతో అంచనాలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. మాములుగా గత కొంత కాలంగా తను బయటికి రావడం తగ్గించేశాడు. ఎంతో ప్రత్యేకం అయితే తప్ప ఓకే చెప్పడం లేదు. అక్కినేని ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉన్న ప్రభాస్ కి తన స్నేహాన్ని చూపించడానికి ఇదో వేదిక కానుంది. ఎలాగూ నాగార్జున వస్తారు. తండ్రి కాబట్టి ఆయన్ని స్పెషల్ గెస్ట్ గా చెప్పరు కానీ రావడం అయితే కన్ఫర్మ్. ట్రైలర్ లాంచ్ కు అందుబాటులో లేకపోయిన దర్శకుడు సురేందర్ రెడ్డి దీనికి హాజరు కావడం ఖాయమే.
చేతిలో ఉన్న అతి తక్కువ సమయంతో ఏజెంట్ పరుగులు పెట్టాలి. ఇంకా కొన్ని ఏరియాలు బిజినెస్ చివరి దశలో ఉందట. రేట్ల విషయంలో చర్చలు ఆలస్యమవుతున్నాయని వినికిడి. అందుకే థియేటర్ల కేటాయింపు కొంత లేట్ అయ్యేలా ఉంది. విరూపాక్షకు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో దానికి రెండో వారంలో చెప్పుకోదగ్గ కౌంట్ లో స్క్రీన్లు కొనసాగిస్తారు. మరోవైపు పొన్నియిన్ సెల్వన్ 2తో కలిపి ఏప్రిల్ 28 పంపకాలు చేయాల్సి ఉంటుంది. టీమ్ మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టరనే నమ్మకాన్ని బలంగా ప్రదర్శిస్తోంది. ఫ్యాన్సే కాదు సగటు ప్రేక్షకులు కోరుకుంటున్నది ఇదే
This post was last modified on April 21, 2023 3:48 pm
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…