ప్రస్తుతం భారతీయ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాల్లో పుష్ప-2 ఒకటి. ఏడాదిన్నర కిందట వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. రిలీజ్ తర్వాత హైప్ అంతకంతకూ పెరిగిపోయి.. పుష్ప-2 మీద అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి సుకుమార్ అండ్ టీం బాగానే కష్టపడుతున్నట్లు సమాచారం.
కథాకథనాలతో పాటు ప్రతి విషయంలోనూ పుష్ప కంటే మెరుగ్గా పుష్ప-2 ఉంటుందన్న ధీమా చిత్ర బృందంలో వ్యక్తమవుతోంది. ఈ మధ్యే రిలీజైన పుష్ప-2 టీజర్ సైతం ఆకట్టుకుంది. ఈసారి పుష్ప అస్సలు తగ్గదేలే అనబోతున్నాడని అర్థమైంది. ఇక సినిమాలో బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ఎవరి స్థాయిలో వాళ్లు కష్టపడుతుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సైతం తన ముద్ర వేయడానికి చూస్తున్నాడట.
పుష్ప-2 స్క్రిప్టు వర్క్ జరుగుతున్నపుడే ఈ సినిమా సంగీత చర్చలు కూడా మొదలయ్యాయి. సుకుమార్ ఏదీ ఒక పట్టాన ఒప్పుకునే రకం కాదు. సినిమా కోసం పదుల సంఖ్యలో ట్యూన్లు ఇస్తే.. అందులో కొన్ని ఫైనలైజ్ చేశాడట సుక్కు. వాటిలో రెండు పాట రికార్డింగ్ పూర్తయినట్లు సమాచారం. అవి రెండూ అదిరిపోతాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
ముఖ్యంగా పుష్ప-1లో బ్లాక్‌బస్టర్ అయిన ఏ బిడ్డా సాంగ్ తరహాలోనే ఇందులోనూ హీరో ఇంట్రో సాంగ్ ఒకటి ఉంటుందట. అది కూడా హీరో పాత్ర చిత్రణతో ముడిపడ్డ పాటేనట. కాస్త ఏయ్ బిడ్డాకు అనుకరణలా అనిపించినప్పటికీ.. ఈ పాట కూడా అదిరిపోతుందని.. ఇది కూడా చార్ట్ బస్టర్ అవడం ఖాయమని ఆ పాట విన్నవాళ్లు అంటున్నారు. జనాలు హమ్ చేసుకునేలా సింపుల్ పదాలతో చంద్రబోస్ సాహిత్యం అందిస్తే.. దేవిశ్రీ మంచి ఊపునిచ్చే మ్యూజిక్ ఇచ్చాడని.. ఈ పాట రిలీజైనపుడు సంచలనం రేపడం ఖాయమని సమాచారం.
This post was last modified on April 21, 2023 2:28 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…