రెండేళ్ల కిందట సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదం టాలీవుడ్‌ను పెద్ద షాక్‌కే గురి చేసింది. ముందు అది చిన్న ప్రమాదంలాగే కనిపించినా.. తర్వాత తర్వాత దాని తీవ్రత అర్థమైంది. ఆసుపత్రిలో కొన్ని వారాల పాటు ఉన్న తేజు.. పూర్తిగా కోలుకుని బయటికి రావడానికి ఏడాది దాకా సమయం పట్టింది. అతను కోలుకున్నాక చేసిన సినిమానే.. విరూపాక్ష. ఈ రోజే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ మిస్టరీ థ్రిల్లర్.. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే రాబట్టేలా కనిపిస్తోంది.
ఐతే సినిమాలో అన్నీ బాగున్నా.. హీరో సాయిధరమ్ తేజ్ లుక్, తన స్క్రీన్ ప్రెజెన్సే కొంచెం తేడాగా అనిపించాయి. అలాగని తేజు బేసిగ్గానే అంత అనుకోవడానికి వీల్లేదు. గతంలో అతను చేసిన సినిమాల్లో చాలా ఉత్సాహంగా కనిపించేవాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుండేది. ఈ సినిమాలో మాత్రం తేజు చాలా డల్లుగా కనిపించాడు. అతడి కదలికలు కూడా నెమ్మదిగా అనిపించాయి.
కొన్ని సన్నివేశాల్లో ఓకే అనిపించినా.. కొన్ని సీన్లలో మాత్రం తేజు నీరసంగా అనిపించాడు. దీన్ని బట్టి చూస్తే అతను పూర్తిగా కోలుకోవడానికి ముందే ఈ చిత్రంలో నటించినట్లున్నాడు. యాక్సిడెంట్ తాలూకు ప్రభావం శారీరకంగానే కాక మానసికంగా కూడా తేజు మీద పడిందేమో.. అందుకే అతణ్ని దాన్నుంచి బయటకు తీసుకురావడానికి సినిమానే మార్గంగా భావించి కుటుంబ సభ్యులు ఈ సినిమాను మొదలుపెట్టించి ఉండొచ్చేమో.
మొత్తానికి తేజును ఇలా డల్లుగా చూడటం మెగా అభిమానులకు కొంచెం ఇబ్బందిగానే అనిపించినా.. ఓవరాల్‌గా సినిమా అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటం.. మంచి టాక్ రావడం సంతోషమే. తేజుకు యాక్సిడెంట్ అయిన సమయంలోనే రిలీజైన రిపబ్లిక్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు విరూపాక్షతో తేజు బౌన్స్ బ్యాక్ అయినట్లే.
This post was last modified on April 21, 2023 2:16 pm
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…