మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాపై ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ‘సైరా’, ‘ఆచార్య’ సినిమాలకు కలిపి నాలుగేళ్ల దాకా టైం తీసుకున్న ఆయన.. ఆ తర్వాత ఉన్నట్లుండి స్పీడు పెంచేశారు. చకచకా ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలను నాలుగు నెలల వ్యవధిలో అవి రిలీజయ్యేలా చూశారు. ఆ తర్వాత ‘భోళా శంకర్’ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఐతే ‘భోళా శంకర్’ తర్వాత చిరు చేసే సినిమా విషయంలో సందిగ్ధత నెలకొంది. ముందు అనుకున్న ప్రకారం అయితే.. వెంకీ కుడుముల సినిమా చేయాల్సింది. కానీ స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందక దాన్ని హోల్డ్‌లో పెట్టారు. ఈలోపు వెంకీ.. నితిన్ సినిమాను మొదలుపెట్టేశాడు. చిరు సంగతే ఎటూ తేలకుండా ఉంది. ఇంకో రెండు నెలల్లో ‘భోళా శంకర్’కు సంబంధించి చిరు పనంతా అయిపోతుంది. ఆలోపు చిరుకు కొత్త ప్రాజెక్టు ఓకే కావాల్సి ఉంది.
చిరు ప్రస్తుతం ఏదో ఒక ఆప్షన్ అని కాకుండా చాలానే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో ప్రధానంగా నలుగురు రచయితలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా.. ఇలా వరుసగా హిట్లు కొట్టిన ప్రసన్న కుమార్ బెజవాడ చిరు కోసం రెండు మూడు కథలు వండుతున్నట్లు సమాచారం. వాటిలో చిరు ఏది ఓకే అంటే దాన్ని ఆయనకు ఇచ్చేస్తాడట. చిరుకు గురి ఉన్న దర్శకుడికి ఆ కథను ఇచ్చి డైరెక్ట్ చేయమంటారు.
మరోవైపు సీనియర్ రైటర్ బీవీఎస్ రవి సైతం చిరు కోసం ఒక కథ వండుతున్నట్లు సమాచారం. తాజాగా ‘సోగ్గాడే చిన్నినాయనా’ దర్శకుడు నాగార్జున రెఫరెన్సుతో చిరును కలిసి కథలు వినిపిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వేణు అలియాస్ వశిష్ఠ కూడా చిరు కోసం కొంచెం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఇంకోవైపు చిరు ఇంతకుముందు ఇచ్చిన హామీ మేరకు పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్ సైతం కథలు రెడీ చేసే పనిలో ఉన్నారు. పూరి సొంతంగా ప్రయత్నిస్తుంటే.. వినాయక్ రైటర్ల మీద ఆధారపడుతున్నారు. మరి ఈ అరడజను మందిలో ఎవరు తమ కథతో చిరును మెప్పిస్తారో చూడాలి.
This post was last modified on April 20, 2023 7:27 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…