Movie News

లండన్ వెళ్ళగానే అన్నీ మటుమాయం

శాకుంతలం డిజాస్టర్ దెబ్బకు మౌన వ్రతం వహించిన సమంతా సినిమా మొదటి వారం పూర్తి చేసుకోకుండానే లండన్ వెళ్లిపోయింది. ఇక్కడ నష్టాల లెక్కలో నిర్మాతలు దిల్ రాజు, గుణశేఖర్ లు బిజీగా ఉండగా తను మాత్రం ఇన్స్ టాలో భగవద్గీత శ్లోకం పెట్టేసి సెలవు తీసుకుంది. కారణం సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ప్రీమియర్ షోకు హాజరు కావడం. దీని హిందీ రీమేక్ లో సామ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా చేసిన క్యారెక్టర్ ఇది. ఈ ఈవెంట్ కి విచ్చేసిన సామ్ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో మంచి స్టిల్స్ కూడా ఇచ్చింది.

ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారణం ఉంది. హైదరాబాద్ లో ఉన్నన్నాళ్ళు కంటి అద్దాలు పెట్టుకుని, జ్వరంతో బాధపడుతూ చాలా ఇబ్బంది పడ్డట్టు కనిపించిన సామ్ రిలీజ్ కు రెండు రోజుల ముందే జ్వరమని చెప్పి మీడియాకు సైతం దూరంగా ఉంది. యాంకర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఛష్మాలు తీయలేదు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళగానే అవి కాస్తా మాయమైపోయాయి. మొహంలో ఛార్మ్ కనిపిస్తోంది. యశోద, శాకుంతలం విడుదల సమయంలో సానుభూతి కోసమే ఇక్కడ డల్ గా కనిపించిందన్న కామెంట్స్ కి ఇప్పుడీ పిక్స్ బలం చేకూరుస్తున్నాయి.

దీనికి సంబంధించి నిజా నిజాలు తనకే తెలుసు కానీ నెటిజెన్లకు అవన్నీ అక్కర్లేదుగా. సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని నిలదీస్తారు. కనీసం ఓ ఆరేడు కోట్ల షేర్ కూడా వసూలు చేయనంత దారుణంగా శాకుంతలం ఫ్లాప్ కావడం ఎవరూ ఊహించనిది. ఒకవేళ హిట్ అయ్యుంటే ఇప్పుడు సమంతా లండన్ వెళ్లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం. అన్నట్టు 14 ఏప్రిల్ తర్వాత అమ్మడు ట్విట్టర్ లోనూ లేదు. ఫారిన్ ట్రిప్ గురించి కానీ సిటాడెల్ అప్డేట్ కానీ ఏదీ ఇవ్వలేదు. బహుశా నెగటివ్ ప్రచారం తాలూకు వేసవి సెగలు గట్టిగానే తగిలినట్టు ఉన్నాయి.

This post was last modified on April 19, 2023 2:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో కొత్త జిల్లాలు.. సర్కారుకు కొత్త సమస్యలు..!

కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…

32 minutes ago

అవతార్ వచ్చినా… దురంధరే గెలుస్తోంది

ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…

2 hours ago

నందమూరి హీరోలకు నెంబర్ 2 గండం

అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…

3 hours ago

ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. శివ‌, రంగీలా, స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్…

5 hours ago

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

8 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

10 hours ago