ఇంకో రెండు నెలల్లో విడుదల కాబోతున్న ఆది పురుష్ ఇండియా కంటే మూడు రోజుల ముందు న్యూ యార్క్ లో జరిగే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో అధికారికంగా ప్రీమియర్ చేయబోతున్నట్టు టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది. సో రిలీజ్ డేట్ విషయంలో ఇంకే అనుమానాలు అక్కర్లేదని స్పష్టంగా క్లారిటీ ఇచ్చినట్టయ్యింది. షో వేస్తోంది యుఎస్ లోనే కాబట్టి అక్కడి ఆడియన్స్, క్రిటిక్స్ చూసే అవకాశం దక్కుతుంది. ప్లస్సులు మైనస్సులు అన్నీ బయటికి వచ్చేస్తాయి. మన దేశంలోలా థియేటర్ వీడియోలు రాకపోయినా అభిప్రాయాల రూపంలో రివ్యూలు ప్రత్యక్షమవుతాయి.
అయినా సరే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో ఆది పురుష్ టీమ్ చిత్రోత్సవంలో ప్రదర్శనకు పచ్చ జెండా ఊపింది. అయితే టీజర్ మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చాక భారీ ఖర్చుతో మళ్ళీ రిపేర్లు చేయించారని, విఎఫ్ఎక్స్ మొత్తం ఫ్రెష్ గా ఉంటుందని వచ్చిన వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదని ముంబై టాక్. కేవలం కలర్ కరెక్షన్ కు సంబంధించి మాత్రమే కొన్ని మార్పులు చేశారు తప్పించి మిగిలినదంతా అదేనని సమాచారం. ట్రిబెకా నిర్వాహకులకు సమర్పించనున్న ప్రింట్ లో ఈ విషయం స్పష్టంగా బయట పడిందని ఆల్రెడీ సొషల్ మీడియా కోడై కూస్తోంది.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో రూపొందిన ఆది పురుష్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ గానే ఉన్నారు. కంటెంట్ ఏ మాత్రం అటుఇటుగా ఉన్నా ప్రేక్షకులు ఎంత నిర్మొహమాటంగా తిరస్కరిస్తారో శాకుంతలంతో మరోసారి అర్థమయ్యింది కాబట్టి రామాయణ గాధని దర్శకుడు ఓం రౌత్ ఎలా హ్యాండిల్ చేశాడోనని ఎదురు చూస్తున్నారు. దీని సంగతలా ఉంచితే ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఒకటి రెండు రోజుల ముందు ఇక్కడా స్పెషల్ షోలు ప్లాన్ చేసినట్టు వినికిడి. ఆధ్యాత్మిక సంస్థలు, రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాలకు సంబంధించిన సెలబ్రిటీలను ఈ స్క్రీనింగ్స్ కి ఆహ్వానిస్తారని టాక్.
This post was last modified on April 19, 2023 12:28 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…