ఒక్క‌డు రీమేక్‌పై త‌మిళుల కామెడీ

ప్ర‌పంచంలో త‌మ సినిమాల‌ను మించి ఏదీ గొప్ప‌గా ఉండ‌ద‌ని బ‌లంగా న‌మ్ముతారు త‌మిళ జ‌నాలు. నిజానికి ఒక‌ప్పుడు త‌మిళ సినిమాల్లో గొప్ప క్వాలిటీ ఉండేది. కానీ గ‌త కొన్నేళ్ల‌లో త‌మిళ సినిమాల స్థాయి బ‌గా ప‌డిపోయింది. తెలుగు సినిమాలు త‌మిళ చిత్రాల‌ను దాటి చాలా ముందుకు వెళ్లిపోయాయి. అయినా త‌మిళులు మాత్రం ఆ విష‌యాన్ని అంగీక‌రించరు. త‌మ సినిమాల‌కు తిరుగులేద‌ని ఫీల‌వుతుంటారు.

ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తెలుగు నుంచి త‌మిళంలోకి రీమేక్ అయి మాతృక‌తో పోలిస్తే సాధార‌ణంగా క‌నిపించే సినిమాల విష‌యంలో కూడా త‌మిళ జ‌నాలు సోష‌ల్ మీడియాలో చేసే అతి మామూలుగా ఉండ‌దు. ముఖ్యంగా త‌మిళ టాప్ స్టార్లో ఒక‌డైన విజ‌య్ చేసిన అత‌డు, పోకిరి, ఛ‌త్ర‌ప‌తి రీమేక్‌ల‌ను చూస్తే.. ఒరిజిన‌ల్స్ ముందు ఏమాత్రం తూగ‌న‌ట్లు ఉంటాయి. వాటిలో విజ‌య్ లుక్స్, యాక్టింగ్ కూడా పేల‌వంగా ఉంటాయి కానీ త‌మిళులు ఈ విష‌యాన్ని ఎంత‌మాత్రం అంగీక‌రించ‌రు. పైగా విజ‌య్ సినిమాలు ఒరిజిన‌ల్స్‌లో కంటే చాలా బాగున్నాయ‌ని.. అత‌నే ఒరిజిన‌ల్ హీరోల కంటే బాగా చేశాడ‌ని ఎలివేష‌న్లు ఇచ్చుకుంటూ ఉంటారు.

గ‌తంలో పోకిరి సినిమా విష‌యంలో ఇలాగే అతి చేసిన త‌మిళులు.. తాజాగా ఒక్క‌డు మూవీ విష‌యంలోనూ అదే చేస్తున్నారు. ఒక్క‌డు రీమేక్ గిల్లి 19వ వార్సికోత్స‌వం సంద‌ర్భంగా.. ఒరిజిన‌ల్‌ను మించిన అరుదైన రీమేక్స్‌లో ఇది ఒక‌ట‌ని త‌మిళ క్రిటిక్స్‌తో పాటు కొన్ని త‌మిళ వెబ్ సైట్స్ కూడా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. అవి చూసి త‌మిల నెటిజ‌న్లు ఇంకా అతి చేశారు. ఐతే తెలుగు నెటిజ‌న్లు త‌క్కువ వాళ్లా? సోష‌ల్ మీడియాలో చాలా బ‌లంగా ఉండే మ‌న వాళ్లు.. ఒక్క‌డు, గిల్లి సినిమాల్లోని స‌న్నివేశాలు.. మ‌హేష్, విజ‌య్‌ల లుక్స్, పెర్ఫామెన్స్‌ను పోలుస్తూ.. వీడియోలు పెట్టి విజ‌య్‌ని, త‌మిళ జ‌నాల్ని ఒక రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.