రామ్ దేవదాస్ తో పరిచయమై మహేష్ బాబు పోకిరితో పెద్ద టర్నింగ్ పాయింట్ అందుకుని టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో అగ్ర హీరోలతో నటించిన ఇలియానా చాలా కాలంగా తెరకు దూరంగా ఉంటోంది. అడపాదడపా హిందీ సినిమాల్లో కనిపించడమే తప్ప తెలుగులో అరుదైపోయింది. చివరిసారి చూసింది రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీలో. ఇదిలా ఉండగా తాను తల్లి కాబోతున్నానంటూ ఇల్లి బ్యూటీ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకప్పుడు తమకు నిద్ర లేకుండా చేసిన కిక్ భామకు పిల్లలు కలగబోతున్నారని ఫ్యాన్స్ సంబరపడ్డారు.
అంతా బాగానే ఉంది కానీ ఇలియానా తన జీవిత భాగస్వామిని మాత్రం పరిచయం చేయలేదు. తనకు మొదట వివాహం అయ్యింది ఆండ్రూ నీబోన్ తో. ఇతనిది ఆస్ట్రేలియా. మూడు ముళ్ళు పడిన కొంతకాలానికే ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో దోస్తీ కట్టింది. ఇద్దరూ సహజీవనం చేశారు. ఇతను స్వయానా కత్రినా కైఫ్ సోదరుడు. ఆమెకు విక్కీ కౌశల్ తో పెళ్ళయాక ఈ రెండు జంటలు కలిసే చక్కర్లు కొట్టాయి. కానీ సెబాస్టియన్ తో ఇలియాకు ఇంత బంధం ఉందనే విషయం బయట ప్రపంచం అంత సులభంగా అర్థం చేసుకోలేకపోయింది.
గుడ్ న్యూస్ చెప్పింది కానీ అసలు రహస్యం కూడా చెప్పి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు తల్లులు కావడం స్పెషల్ టాపిక్ గా మారిపోతోంది. నయనతార, అలియా భట్ ఇలా సెలబ్రిటీ మదర్స్ లిస్టు పెరుగుతోంది. అన్నట్టు ఇలియానాది సరోగసినా లేక సహజ గర్భధారణా అనేది సస్పెన్సే. అన్నట్టు సెబాస్టియన్ నుంచి మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి సౌండ్ లేదు. కత్రినా విష్ చేయడం లాంటివి ప్రస్తుతానికి కనిపించలేదు. రాజుగారు తుమ్మినా దగ్గినా న్యూస్ అన్నట్టు హీరోయిన్లు మాజీ అయిపోయినా సరే ప్రతి వార్తా హాట్ టాపిక్కే.