Movie News

తెలుగు దర్శకుల మీదే విజయ్ గురి

ఎంత రొటీన్ సినిమా తీసినా సరే వంద కోట్ల వసూళ్లు మంచినీళ్ల ప్రాయంగా సాధిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు మన తెలుగు దర్శకుల మీద గట్టి గురి కుదురుతోంది. వారసుడు తెలుగు వెర్షన్ ఫలితం ఎలా ఉన్నా దాన్ని వంశీపైడిపల్లి హ్యాండిల్ చేసిన తీరు విపరీతంగా నచ్చేయడంతో వెంటనే ఇంకో కథను సిద్ధం చేసుకోమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఫైనల్ వెర్షన్ లాకయ్యాక ఆ లాంఛనం కూడా అయిపోతుంది. ప్రస్తుతం విజయ్ సన్ పిక్చర్స్ కోసం లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న లియా ఆగస్ట్ నెలాఖరులో షూటింగ్ పూర్తి చేసుకోనుంది.

ఇది జరుగుతున్న క్రమంలోనే మరో టాలీవుడ్ డైరెక్టర్ కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెన్నై టాక్. గోపిచంద్ మలినేని చెప్పిన ఒక లైన్ నచ్చడంతో సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. క్రాక్, వీరసింహారెడ్డిలతోపాటు గతంలో తీసిన సినిమాలు విజయ్ కు నచ్చడం వల్లే ఇది పట్టాలెక్కే ఛాన్స్ పెరిగిందని అంటున్నారు. మధ్యవర్తిగా దిల్ రాజు వ్యవహరించి ఈ సిట్టింగ్ చేయించారట. ఇప్పటిదాకా కేవలం తెలుగు సినిమాలకే పరిమితమైన మలినేని ఇప్పుడు మార్కెట్ పెంచుకునే దిశగా చూస్తున్నాడు. మన హీరోలందరూ బిజీగా ఉండటంతో ఇలా విజయ్ ని లైన్ లో తీసుకున్నాడు.

ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం జాక్ పాట్ కొట్టినట్టే. ఎందుకంటే బాలయ్య స్థాయి హీరోని డీల్ చేశాక గోపిచంద్ మలినేని లాంటి వాళ్ళు మీడియం రేంజ్ లో సర్దుకోలేరు. మరోవైపు ఇంకో ఏడాది రెండేళ్ల పాటు ఎవరి కాల్ షీట్లు ఖాళీగా లేవు. దాని కోసం టైం వేస్ట్ చేసుకోవడం కన్నా విజయ్ తో ప్రాజెక్ట్ లాక్ చేసుకుంటే ఈజీగా రెండు వందల కోట్ల బొమ్మ ఖాతాలో పడిపోతుంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే ట్రిపుల్ సెంచరీ కొట్టొచ్చు. ఖచ్చితంగా అయిదారు నెలల్లోనే సినిమా మొత్తం పూర్తయ్యేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న విజయ్ కి తెలివిగా ఆప్షన్లు ఎంచుకుంటున్నాడు.

This post was last modified on April 18, 2023 11:07 am

Share

Recent Posts

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

19 minutes ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

30 minutes ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

2 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

2 hours ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

3 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

5 hours ago