దుల్కర్ సల్మాన్‌ను పర భాషా నటుడిగా తెలుగు వాళ్లు ఎవ్వరూ ఫీలవ్వట్లేదు ఇప్పుడు. మణిరత్నం అనువాద చిత్రం ‘ఓకే బంగారం’తోనే అతను మన ప్రేక్షకుల మనసు దోచాడు. ఆ తర్వాత ‘మహానటి’ చిత్రంలో జెమిని గణేషన్ పాత్రతో మరింతగా మెప్పించాడు. ఇక ‘సీతారామం’ సినిమాలో రామ్ పాత్రలో అతడి అభినయం గురించి ఏం చెప్పాలి? మన హీరోలు కూడా ఎవరూ ఆ పాత్రకు సూట్ కారు, తనే పర్ఫెక్ట్ అని తెలుగు ప్రేక్షకులతో అనిపించే స్థాయిలో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చాడు.
నటనకు తోడు తెలుగు ఉచ్ఛారణ విషయంలోనూ దుల్కర్ మంచి మార్కులు వేయించుకున్నాడు. అసలు నెగెటివిటీ అన్నదే లేకుండా తన తన నటన చూస్తే ఎవ్వరైనా అభిమాని అయిపోవాల్సిందే అన్నట్లుగా పెర్ఫామ్ చేస్తాడు దుల్కర్. ‘సీతారామం’ చూశాక మరిందరు తెలుగు దర్శకులు అతడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఐతే మలయాళంలో ఫుల్ బిజీగా ఉన్న దుల్కర్.. ఇతర భాషల్లో ఆచితూచే సినిమాలు ఎంచుకుంటాడు. చాలా ప్రత్యేకంగా ఉన్న కథల్నే ఓకే చేస్తాడు. తాజాగా అతను మరో తెలుగు దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతనే.. వెంకీ అట్లూరి. ‘తొలి ప్రేమ’ తర్వాత తీసిన రెండు చిత్రాలతో నిరాశపరిచినప్పటికీ.. ‘సార్’ మూవీతో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు వెంకీ. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్నందుకుంది. ఇప్పుడు అతను దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో ఒక బహు భాషా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నాడట.
రంగ్ దె, సార్ చిత్రాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్‌లోనే తన తర్వాతి చిత్రం కూడా ఉంటుందని వెంకీ ఇప్పటికే ప్రకటించాడు. అన్నట్లే సితారకే ఈ సినిమా కూడా చేయనున్నాడట. ఇది పక్కా లవ్ స్టోరీ అని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
This post was last modified on April 17, 2023 4:41 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…