తమ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్న మేకర్స్ విడుదలకు ముందే ప్రిమియర్స్ వేయడం మామూలే. అది వాళ్ల కాన్ఫిడెన్స్‌ను తెలియజేస్తుంది. సినిమా బాగుంటే ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయి సినిమాకు కలిసొస్తుంది. కానీ సినిమా అటు ఇటుగా ఉంటే మాత్రం ప్రిమియర్ షోలు కొంప ముంచడం ఖాయం. ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్న సినిమాలు కూడా ఉన్నాయి.
టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘శాకుంతలం’ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే తయారైంది. ఈ చిత్రానికి రిలీజ్‌కు నాలుగు రోజుల ముందే హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్‌లో స్పెషల్ త్రీడీ ప్రిమియర్ వేశారు. ఆ షోకు మీడియా వాళ్లను అనుమతించలేదు. వాళ్ల కోసం తర్వాతి రోజు వేరే షో వేయాలని అనుకున్నారు. ఐతే సినిమా మీద ధీమాగా ఉన్న మేకర్స్ ప్రిమియర్ షో నుంచి మంచి టాక్ వస్తుందని ఆశించారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది.
నిజంగా సినిమా జనాలకు నచ్చి ఉంటే ఆహా ఓహో అంటూ కొనియాడేవారు. సోషల్ మీడియాలో పాజిటివ్ ట్వీట్లు గట్టిగా పడేవి. వాటిని టీం కూడా ప్రమోట్ చేసేది. కానీ ‘శాకుంతలం’ షో తర్వాత జనాలు కామ్‌గా ఉండిపోయారు. బాగా కష్టపడి, భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా కాబట్టి షో చూసిన జనాలు చాలా వరకు సైలెంటుగా ఉండిపోయారు. కానీ కొంతమంది మాత్రం సినిమాను ట్రోల్ చేశారు. మీమర్స్ కొందరు డ్యూటీ ఎక్కి ఇది సినిమా కాదు.. సీరియల్ అంటూ మీమ్స్ వేశారు. ఇది బయ్యర్ల దృష్టికి వెళ్లింది. దాని వల్ల నిర్మాతలు ఇరుకున పడ్డట్లు సమాచారం.
ముందు చేసుకున్న ఒప్పందాల మేర డబ్బులు కట్టడానికి బయ్యర్లు అంగీకరించలేదని.. దీంతో చివరి నిమిషాల్లో దర్శక నిర్మాత గుణశేఖర్ భారీ డెఫిషిట్‌తో సినిమాను రిలీజ్ చేసుకోవాల్సి వచ్చిందని.. ఈ విషయంలో సహ నిర్మాత దిల్ రాజుకు ఆయనకు చెడిందని సమాచారం. ఇప్పుడు సినిమాకు షేర్ చాలా తక్కువ రావడంతో బయ్యర్లు చేసిన సగం చెల్లింపులు కూడా వెనక్కి రాని పరిస్థితి తలెత్తిందని.. వాళ్లను గుణశేఖర్ ఏమీ అడిగే పరిస్థితి లేదని.. మొత్తంగా ఆయనకు ఈ సినిమా భారీ నష్టాలే తెచ్చిపెట్టిందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.
This post was last modified on April 17, 2023 4:26 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…