Movie News

మణిరత్నం సినిమాకు ఇలాంటి పరిస్థితా

కోలీవుడ్ బాహుబలిగా అక్కడివాళ్లు చెప్పుకునే పొన్నియిన్ సెల్వన్ 2 విడుదల ఇంకో పదకొండు రోజుల్లో ఉంది. నటీనటులు కార్తీ, విక్రమ్, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి తదితరులు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని అక్కడా ఇక్కడా తిరుగుతూ ప్రమోషన్లు చేసుకుంటున్నారు. తమిళనాడు కేరళ మీద వీళ్ళ ఫోకస్ ఎక్కువగా ఉంది. తెలుగు వెర్షన్ ని మాత్రం లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్న దిల్ రాజు ఇప్పటిదాకా ఎలాంటి చొరవ చూపించలేదు. అసలే శాకుంతలం గాయం పచ్చిగా ఉండగా వెంటనే పీఎస్ 2 కోసం రంగంలోకి దిగేందుకు మనస్కరించలేదేమో.

పీఎస్ 1 ఏపీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. పది కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్మితే బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడానికి అష్టకష్టాలు పడింది. మన ఆడియన్స్ కాన్సెప్ట్ అర్థం కాక సోషల్ మీడియాలో పాజిటివ్ గా స్పందించలేకపోయారు. దీంతో సహజంగా ఆ ప్రభావం సీక్వెల్ మీద పడింది. హైప్ రాలేదు. ట్రేడ్ సైతం అనాసక్తిగా ఉంది. ఎలాగూ ఏజెంట్ అదే డేట్ కి వస్తుండటంతో ఫోకస్ దాని మీదే ఉంది. ఒకవేళ అఖిల్ కనక బ్లాక్ బస్టర్ కొడితే పీఎస్ 2 ఎదురీదటం కష్టమే. నిజానికి సెకండ్ పార్ట్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నా ప్రయోజనం కలగలేదు.

రిలీజ్ ఇంకో రెండు మూడు రోజులు ఉందనగా హైదరాబాద్ వచ్చి ఈవెంట్లు ఇంటర్వ్యూలు గట్రా చేస్తారు కానీ అప్పటికప్పుడు బజ్ రావడం కష్టం. ఏఆర్ రెహమాన్ పాటలు యూట్యూబ్ లో వచ్చినా ఒరిజినల్ వెర్షన్ అంత స్పందన ఇక్కడ లేదు. అసలు 28న విడుదలనే సంగతే మూవీ లవర్స్ కి తప్ప సాధారణ ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. ఈసారి బిజినెస్ లక్ష్యం పది కోట్లు పెట్టుకుంటారో లేక అంతకన్నా తక్కువకు రాజీ అవుతారో చూడాలి. మొదటిసారి ఒక సౌత్ సినిమా ఫోర్డి ఎక్స్ టెక్నాలజీ, ఐమాక్స్ రేషియోలో వస్తున్న ఘనత పీఎస్ 2కే దక్కనుంది.

This post was last modified on April 17, 2023 4:23 pm

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

3 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

10 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

10 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

11 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

11 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

12 hours ago