Movie News

అప్పుడు వైవీఎస్.. ఇప్పుడు గుణశేఖర్

సినీ రంగంలో కొన్నిసార్లు కొందరి మీద జనాల్లో ఉండే సానుకూలత, సానుభూతి కూడా సినిమాలకు కలిసొస్తుంటాయి. కష్టపడి, ఎంతో తపనతో.. ఎంతో రిస్క్ చేసి ఒక సినిమా తీసినపుడు.. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా సరే ఆదరిస్తుంటారు. రిలీజ్ టైమింగ్ కలిసి రావడమే కాక.. ఆ చిత్రంలో నటించిన వారి మీద ప్రేక్షకుల్లో ఉన్న సానుకూలత, సానుభూతి కూడా కలిసొచ్చి సినిమాలు ఆడేస్తుంటాయి.

ఐతే జీవితాలు తలకిందులు అయిపోయే రిస్కులు చేసి అదృష్టం కొద్దీ బయటపడినపుడు.. ఇంకోసారి అలాంటి సాహసాల జోలికి వెళ్లకుంటే మంచిది. కానీ ఒకసారి వర్కవుట్ అయింది కదా అని మళ్లీ అలాంటి రిస్కే చేస్తే తేడా కొట్టొచ్చు. ఇందుకు ఒకప్పుడు వైవీఎస్ చౌదరి జీవితమే ఉదాహరణ. కెరీర్లో ఒక దశ వరకు వేరే నిర్మాతల సినిమాలకు దర్శకత్వం వహించిన చౌదరి.. ‘లాహిరి లాహిరి లాహిరిలో’తో సొంత బేనర్లో సినిమా చేసి రిస్క్ చేశాడు. అంచనాల్లేకుండా రిలీజైన ఆ చిత్రం ఘనవిజయం సాధించి చౌదరికి సినీ రంగంలో పునర్జన్మను ఇచ్చింది.

ఐతే ఇది ఆడింది కదా అని ఆ తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్‌తో హరికృష్ణనే పెట్టి ‘సీతయ్య’ తీశాడు. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కొన్నేళ్ల తర్వాత కెరీర్ మళ్లీ ఇబ్బందుల్లో పడ్డ స్థితిలో ‘దేవదాసు’ తీశాడు. ఆ సినిమా డివైడ్ టాక్‌ను తట్టుకుని బ్లాక్‌బస్టర్ అయింది. కొత్త హీరో హీరోయిన్లను పెట్టి అంత బడ్జెట్లో సినిమా తీయడం పెద్ద రిస్కే. కానీ ఆ రిస్క్ పని చేసి చౌదరికి ఘనవిజయాన్నందించింది. ఐతే రెండోసారి కూడా ఇలా బయటపడ్డ చౌదరి.. దీన్ని లైఫ్ లైన్ లాగా భావించలేదు. మళ్లీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఏకంగా రూ.40 కోట్ల దాకా బడ్జెట్ పెట్టి ‘రేయ్’ సినిమా తీశాడు. రకరకాల కారణాల వల్ల ఏళ్ల తరబడి ఆ చిత్రం విడుదలకే నోచుకోలేదు. తీరా రిలీజయ్యాక దారుణంగా బోల్తా కొట్టింది. దెబ్బకి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయాడు చౌదరి. ఇప్పటిదాకా ఇంకో సినిమా తీయలేదు. తీసే అవకాశాలు కూడా కనిపించలేదు.

ఇప్పుడు గుణశేఖర్ పరిస్థితి కూడా చౌదరి లాగే తయారయ్యేలా ఉంది. ఆయన కొన్నేళ్ల కిందట ఎంతో సాహసోపేతంగా ‘రుద్రమదేవి’ తీశాడు. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ మీద అప్పట్లోనే 60-70 కోట్ల బడ్జెట్ పెట్టేశాడు. ఆ సినిమా అంచనాలను మించి విజయం సాధించిందంటే గుణశేఖర్ మీద ప్రేక్షకుల్లో ఉన్న సానుకూలత, సానుభూతి కారణం అనడంలో సందేహం లేదు.

ఐతే ఇంత పెద్ద రిస్క్ చేసి ఎలాగోలా బయటపడ్డ గుణ.. మళ్లీ అలాంటి సాహసమే చేశాడు. ‘శాకుంతలం’ మీద భారీగా డబ్బు పెట్టేశాడు. దిల్ రాజు కూడా భాగస్వామే అయినప్పటికీ మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ గుణదే. ఇప్పుడీ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టేలాగే కనిపిస్తోంది. భారీ నష్టాలు తప్పేట్లు లేవు. ఈ భారంలో ఎక్కువ మోయాల్సింది గుణనే. ఇప్పటిదాకా సంపాదించింది అంతా ఈ సినిమాతో కొట్టుకుపోతే ఆశ్చర్యం లేదు. ఈ స్థితి నుంచి ఆయన కోలుకుంటారా.. లేక చౌదరిలా తెరమరుగు అయిపోతాడా అన్నది చూడాలి.

This post was last modified on April 17, 2023 1:54 am

Share

Recent Posts

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

2 hours ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

3 hours ago

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

4 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

5 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

9 hours ago