హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అందరూ చేయలేరు. ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకమైన అంచనాలు ఉన్నవాళ్లు, ఏ పాత్ర చేసినా స్వీకరించడానికి తగినంత మార్కెట్ సంపాదించుకున్న కథానాయికలు మాత్రమే మార్కెట్ ని శాశిస్తారు. శాకుంతలం డిజాస్టర్ ఫలితం ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. కనీసం యావరేజ్ అయినా ఇంత ఫీలయ్యేవాళ్ళు కాదు కానీ రొట్ట మాస్ రుద్రుడికి పోటీ ఇవ్వలేనంత దారుణంగా రెండో రోజే పడిపోవడం ఊహించనిది. సమంతాను స్క్రీన్ పై శకుంతలగా జనం రిసీవ్ చేసుకోలేదు. పైగా అతకని స్వంత డబ్బింగ్ ఇంకాస్త డ్యామేజ్ చేసింది.
ఇక్కడే ఫ్యాన్స్ కి అనుష్క గుర్తొస్తోంది. కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఓపెనింగ్స్ రాబట్టిన వైనం గుర్తు చేసుకుంటున్నారు. అరుంధతితో టైటిల్ రోల్ పోషించినప్పుడు స్టార్ హీరో లేకుండా ఫామ్ తగ్గిపోయిన కోడి రామకృష్ణ ఏం హిట్ కొడతారులేనని అందరూ అనుమాన పడ్డారు. కట్ చేస్తే ఆ బ్లాక్ బస్టర్ ని ఇప్పటికీ మర్చిపోలేం. పంచాక్షరి లాంటి బ్యాడ్ మూవీకి సైతం ఓపెనింగ్స్ వచ్చాయంటే దానికి కారణం వేరే ఏముంటుంది. భాగమతి విజయం సాధించినా, నిశ్శబ్దం ఓటిటి రిలీజ్ కి అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తం చెల్లించినా అదంతా స్వీటీ క్రెడిటేనని మళ్ళీ చెప్పనక్కర్లేదు.
కొన్నేళ్లు బ్రేక్ తీసుకుంది కానీ ఒకవేళ ఇదే శాకుంతలంని ఇంకొంచెం పవర్ ఫుల్ గా తీర్చిదిద్ధి గుణశేఖర్ అనుష్కతో తీసి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. ఈయనే తీసిన రుద్రమదేవికి ఫస్ట్ డేకి పది కోట్లకు పైగా వసూలు కావడం వెనుక మొదట పనిచేసింది ఈమె బ్రాండే. తర్వాత బన్నీ లాగేశాడు. త్వరలో రాబోతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో నవీన్ పోలిశెట్టితో సమానంగా అనుష్కని పోస్టర్లలో మార్కెట్ చేస్తున్నారు. ఒకప్పుడు విజయశాంతి ఆ తర్వాత అనుష్క ఇలా కొందరు మాత్రమే ప్రత్యేక ముద్ర వేయగలిగారు. సామ్ ఎంత మంచి నటి అయినా సరే బరువైన పాత్రలకు రైట్ ఛాయస్ కాలేకపోయింది.
This post was last modified on April 16, 2023 11:25 am
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…