ఒకరు చేయాల్సిన పాత్ర అనుకోకుండా ఇంకొకరికి వెళ్లడం.. ఆ పాత్ర సూపర్ క్లిక్ అయ్యాక ఆ క్యారెక్టర్ వదులుకున్న వాళ్లు లోపల ఫీలవడం ఇండస్ట్రీలో మామూలే. ఇలా తాము వదులుకున్న పాత్రల గురించి ఆర్టిస్టులు చెబుతున్నపుడు వాళ్లే ఆ పాత్ర చేసి ఉంటే ఎలా ఉండేదన్న ఊహ ప్రేక్షకులకు వస్తుంది. ఇప్పుడు కన్నడ నటి ప్రేమ చెప్పిన విషయం తెలుసుకుని అందరికీ ఇలాంటి ఊహే కలుగుతోంది. తెలుగులో దేవి సహా పలు హిట్ చిత్రాల్లో నటించిన ప్రేమ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది.
బ్లాక్ బస్టర్ మూవీ అరుంధతిలో ప్రధాన పాత్రకు ముందు తననే అడిగారని చెప్పింది. ఈ చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణనే ప్రేమను దేవి సినిమాతో తెలుగులో పరిచయం చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్టయింది. అరుంధతి సినిమాలో జేజెమ్మ పాత్రకు కూడా ఆయన మొదట తననే అడిగారని.. కానీ ఆ సమయంలో కన్నడలో బిజీగా ఉండటం.. అరుంధతి కోసం కోరినన్ని బల్క్ డేట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో తాను ఆ సినిమాను ఒప్పుకోలేదని ప్రేమ చెప్పింది.
తర్వాత తాను అరుంధతి సినిమా చూశానని.. ఎంతగానో నచ్చిందని.. అనుష్క కూడా ఆ సినిమాలో బాగా నటించిందని ప్రేమ చెప్పింది. కొన్ని పాత్రల మీద అవి చేయాల్సిన నటుల పేర్లు రాసి ఉంటాయని.. అరుంధతి పాత్ర అలాగే అనుష్కను వరించి ఉంటుందని ఆమె అంది. ఈ సినిమా చేయనందుకు తనకేమీ బాధ లేదని కూడా ప్రేమ చెప్పింది. ఐతే ప్రేమ మంచి నటే కానీ.. అరుంధతి పాత్రకు ఆమె సూటయ్యేదా అంటే ఔనని చెప్పలేం. అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్, ఒక యోధురాలిగా ఆమె ఇచ్చిన పెర్ఫామెన్స్‌ను ప్రేమనే కాదు.. వేరే హీరోయిన్లు ఎవరైనా మ్యాచ్ చేయగలిగేవారా అంటే సందేహమే.
This post was last modified on April 14, 2023 4:27 pm
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…