టాలీవుడ్ లో అత్యధిక హీరోలు దర్శకులు డిమాండ్ చేస్తున్న హీరోయిన్ శ్రీలీల. చేతిలో పది సినిమాలకు పైగా బిజీగా ఉన్న ముద్దుగుమ్మ తనొక్కర్తే అంటే ఆశ్చర్యం కలగక మానదు. అయినా ఇది నిజం. డెబ్యూ మూవీ పెళ్లి సందDలో ఎంత రొట్ట కంటెంట్ ఉన్నా కేవలం తన గ్లామర్ వల్లే తర్వాతి స్థాయికి వెళ్లిందనేది దాన్ని ఆడించిన బయ్యర్లు ఒప్పుకునే మాట. ఇక ధమాకాలో రవితేజతో చేసిన అల్లరి, అది బ్లాక్ బస్టర్ కావడంలో డాన్సులు పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. పల్సర్ బైకు, జింతాకు, దండకడియాల్ రిపీట్ వ్యూస్ కి తనే ప్రధాన కారణం.
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సరసన జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ లో అడుగు పెట్టేసింది. ఈ సందర్భంగా ఓ అభిమాని దర్శకుడు హరీష్ శంకర్ ని ఉద్దేశించి ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ శ్రీలీల కాంబోలో ఒక మంచి మాస్ పాట పెట్టమని అడిగాడు. దీనికి అంగీకారం తెలుపుతున్నట్టుగా ఆయన ఇచ్చిన రిప్లై ఫ్యాన్స్ కి ఉత్సాహం తెచ్చింది. మాములుగానే సాంగ్స్ తో రచ్చ చేయడం హరీష్ శంకర్ కి అలవాటు. గబ్బర్ సింగ్, మిరపకాయ్ లో మ్యూజిక్ ప్లస్ డాన్స్ విషయంలో తీసుకున్న శ్రద్ధ ఎంతగా పని చేశాయో చూశాం
ఇప్పుడు ఉస్తాద్ కు సైతం అదే ఫార్ములా వాడతాడు. తమిళ తేరికి భారీ ఎత్తున మార్పులు చేసిన రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవిశ్రీ ప్రసాద్ హుషారైన ట్యూన్లు కంపోజ్ చేయబోతున్నాడు. అన్నయ్య చిరంజీవికి ఇచ్చిన వాల్తేరు వీరయ్య ఆల్బమ్ కి బిజిఎంకి మంచి పేరు రావడంతో తమ్ముడు పవన్ కి అంతకు మించి ఇవ్వాలనే కసితో ఉన్నాడు. ఇక పవన్ శ్రీలీల కలయికలో సాంగ్ అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో హరీష్ కి బాగా తెలుసు కనక దగ్గరుండి మరీ బెస్ట్ ట్యూన్ చేయించుకుంటాడు. సరైన కొరియోగ్రాఫర్ పడితే థియేటర్లో పూనకాలే
This post was last modified on April 14, 2023 4:25 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…