Movie News

డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు

కెజిఎఫ్ ని మక్కికి మక్కి అనుకరించే ప్రయత్నం చేసి దానికి పోస్ట్ ఇండిపెండెన్స్ కలర్ ఇచ్చి తీసిన కబ్జ బాక్సాఫీస్ వద్ద ఎంత దారుణంగా బోల్తా కొట్టిందో చూశాం. కనీసం ఏ ఒక్క విభాగం, తారాగణం ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి. కన్నడలోనూ ఇదేమి అద్భుతాలు చేయలేకపోయింది. టీమ్ మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్ల పోస్టర్ వేసుకోవడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దారి తీసింది. ఒరిజినల్ వెర్షన్ పక్కనపెడితే మిగిలిన ఏ భాషలోనూ కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కు తేలేకపోయింది. హిందీలో అయితే మరీ దారుణం. అన్నీ నెగటివ్ షేర్లే

ఇంతా జరిగినా దర్శకుడు చంద్రు, నిర్మాతలు తగ్గేదేలే అంటున్నారు. కబ్జ 2ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మేరకు పోస్టర్ కూడా వచ్చేసింది. స్క్రిప్ట్ లాక్ అయ్యిందని బెంగళూరు టాక్. నిజానికి మొదటి భాగాన్ని ఉపేంద్రతో పాటు సుదీప్, శివరాజ్ కుమార్ లు ఉన్నట్టుగా మల్టీస్టారర్ బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే ఈ ఇద్దరూ ఉన్నది కేవలం కొద్దినిమిషాలే కావడం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఏదో విక్రమ్ లో సూర్య ఎపిసోడ్ లా పేలుతుందనుకుంటే ఇది కాస్తా తుస్సుమంది. కట్ చేస్తే ఇప్పుడు శివరాజ్ కుమార్ నే హైలైట్ చేస్తూ సీక్వెల్ తీస్తారట

మొత్తానికి ఇదంతా చూస్తుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో లేక మరోసారి ప్రేక్షకులను మోసం చేసే ప్రయత్నం అనాలో అంతు చిక్కడం లేదు. ఒక సబ్జెక్టు తిరస్కారానికి గురైన తర్వాత మళ్ళీ దాన్ని టచ్ చేయకపోవడం ఉత్తమం. అలా కాకుండా మీరు ఫస్ట్ పార్ట్ చూడలేదు కాబట్టి దానికి శిక్షగా మరొకటి ఇస్తున్నామనేలా చేయడం మాత్రం విచిత్రం. కెజిఎఫ్, సలార్ లకు సంగీతం అందించిన రవి బస్రూర్ పనితనం సైతం కబ్జను కాపాడలేకపోయింది. అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చాక కూడా దీనికి నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఆగలేదు. థియేటర్లో మిస్ అయ్యిందే మంచిపనని సంతోషపడుతున్నారు

This post was last modified on April 14, 2023 10:28 am

Share

Recent Posts

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

3 hours ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

4 hours ago

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

5 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

6 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

10 hours ago