యువ కథానాయకుడు నారా రోహిత్ ఒకప్పుడు ఎంత బిజీగా ఉండేవాడో తెలిసిందే. వైవిధ్యమైన కథలతోనే ఎక్కువగా ప్రయాణం చేసిన అతను.. ఒక దశలో తొమ్మిది సినిమాలు లైన్లో పెట్టాడు. రెండేళ్ల వ్యవధిలో అరడజనుకు పైగా సినిమాలు కూడా రిలీజ్ చేశాడు. అందులో కొన్ని మంచి ఫలితం కూడా అందుకున్నాయి. ఐతే ఒక దశ దాటాక రోహిత్ సినిమాలు వరుసగా బోల్తా కొట్టడం మొదలైంది. దీంతో మార్కెట్ బాగా దెబ్బ తినేసింది.
దీంతో ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయాడు రోహిత్. చివరగా ఏడాదిన్నర కిందట అతడి నుంచి ‘వీరభోగ వసంతరాయలు’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఫలితం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చప్పుడే లేకుండా వచ్చి వెళ్లిపోయిన ఆ సినిమా తర్వాత రోహిత్ అడ్రస్ లేకుండా పోయాడు. మంచి ఫినాన్షియల్ బ్యాకప్ ఉన్న హీరో ఇలా అదృశ్యం అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఐతే రోహిత్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న అతడి ఆప్త మిత్రుడు శ్రీవిష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడి గురించి మాట్లాడాడు. నారా రోహిత్ అడ్రస్ లేడేంటి అని అడిగితే.. ‘‘అతడి సినిమాలు కొన్ని తీవ్రంగా నిరాశ పరిచాయి. దీంతో పునరాలోచనలో పడ్డాడు. కొంచెం గ్యాప్ అవసరమనుకున్నాడు. అందుకే కొంత కాలం పాటు కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఐతే త్వరలో నేను, రోహిత్ కలిసి ఓ పెద్ద సినిమా చేయడబోతున్నాం. దాంతో పాటు రోహిత్ ఇంకొన్ని సినిమాలు కూడా లైన్లో పెట్టాడు. రీఎంట్రీలో అతడి నుంచి మంచి సినిమాలొస్తాయి’’ అని విష్ణు తెలిపాడు.
ఇక రోహిత్‌తో తన స్నేహం గురించి చెబుతూ.. ‘‘రోహిత్‌కు నాపై అంత అభిమానం ఎందుకొచ్చిందో తెలియదు. అలాంటి వ్యక్తి మరొకరిని నేను చూడలేదు. ఎంతసేపూ ఇవ్వడానికే చూస్తాడు. ఏమీ ఆశించడు. నేనైనా బిజీగా ఉండి తనకు ఫోన్ చేయడం మరిచిపోతుంటా. కానీ రోహిత్ మాత్రం ప్రతి రోజూ గుర్తుంచుకుని నాకు ఫోన్ చేస్తాడు. అలాంటి ఫ్రెండు ఉండటం నా అదృష్టం’’ అని చెప్పాడు.
This post was last modified on April 23, 2020 1:46 pm
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…