టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్, మన టాప్ డైరెక్టర్లలో ఒకడైన త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల మధ్య మంచి అనుబంధమే ఉందని.. ‘అరవింద సమేత’ సినిమా చేస్తున్న సమయంలో అందరికీ తెలిసింది. తాము ఎంత సన్నిహితులమో ఎన్టీఆర్ స్వయంగా ఆ సందర్భంలో చెప్పుకున్నాడు. తాను త్రివిక్రమ్‌ను ‘స్వామీ’ అని పిలుస్తానని కూడా తెలిపాడు. త్రివిక్రమ్ సైతం.. ఎన్టీఆర్ గురించి ఆ సినిమా టైంలో చాలా గొప్పగా మాట్లాడాడు.
ఈ అనుబంధానికి తోడు ‘అరవింద సమేత’ మంచి విజయం సాధించడంతో వీరి కలయికలో ఇంకో సినిమాకు సన్నాహాలు జరిగాయి. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. అనౌన్స్‌మెంట్ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. తారక్, త్రివిక్రమ్ మధ్య ఏవో అభిప్రాయ భేదాలు తలెత్తాయని.. దీంతో సినిమా ఆగిపోయిందని.. తర్వాత ఇద్దరి మధ్య మాటలు కూడా కరువయ్యాయని అప్పట్లో గట్టి ప్రచారమే జరిగింది.
దీనికి తగ్గట్లే తర్వాత ఏ సందర్భంలోనూ తారక్, త్రివిక్రమ్ కలిసి కనిపించకపోవడం సందేహాలను మరింత పెంచింది. కానీ తాజాగా ఈ ప్రచారానికి తెరదించుతూ తారక్, త్రివిక్రమ్ కలిశారు. ఇటీవలే అమేజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్‌కు ఎన్టీఆర్ ఇచ్చిన స్పెషల్ పార్టీలో త్రివిక్రమ్ తళుక్కుమన్నాడు. ఈ పార్టీకి ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులనే తారక్ పిలిచాడు. రాజమౌళి సహా పలువురు హాజరైన ఈ పార్టీలో త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. ఈ స్పెషల్ పార్టీకి త్రివిక్రమ్‌ను పిలిచాడు అంటే.. తారక్‌కు ఆయనతో ఎలాంటి విభేదాలు లేనట్లే.
కథల విషయంలో అభిప్రాయాలు కలవక ఆగిపోయే సినిమాలు చాలానే ఉంటాయి. అంత మాత్రాన వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని అనుకోకూడదు. తారక్, త్రివిక్రమ్ విషయంలోనూ అదే జరిగిందన్నది స్పష్టం. భవిష్యత్తులో ఈ ఇద్దరూ కలిసి ఇంకో సినిమా చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రస్తుతం తారక్ కొరటాల సినిమాలో నటిస్తుంటే.. త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాలో బిజీగా ఉన్నాడు.
This post was last modified on April 13, 2023 3:00 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…