ఏజెంట్ విడుదలకు ఇంకో పదిహేను రోజులు మాత్రమే ఉంది. ప్యాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ ఇంత దగ్గర పడుతున్నా ప్రమోషన్లు, పబ్లిసిటీ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దర్శకుడు సురేందర్ రెడ్డి చివరి పాట చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాడు. కనీసం ఏదైనా మీడియా ఇంటర్వ్యూ ఇచ్చే పొజిషన్ కనిపించడం లేదు. మరోవైపు పాటలకు సంబంధించిన అప్డేట్స్ ఎలాంటి ఉత్సుకతని రేపకపోగా పైపెచ్చు కొంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ కూడా తీసుకురావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
దీని ప్రభావం నేరుగా బిజినెస్ మీద పడుతోందని ట్రేడ్ టాక్. కొన్ని నెలల క్రితం ఇరవై ఏడు కోట్ల దాకా డిమాండ్ ఉన్న ఏపీకు సంబంధించిన ఆరు ఏరియాలకు ఇప్పుడు పది తగ్గించి బయ్యర్లు పదిహేడు కోట్లే అడుగుతున్నారని వినికిడి. నైజామ్ లోనూ ముందున్నంత బజ్ లేకపోవడంతో రెవిన్యూ రావాలంటే స్వంతంగా రిలీజ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదని మరో న్యూస్. మొత్తానికి అరవై కోట్ల దాకా థియేట్రికల్ మార్కెట్ ని టార్గెట్ చేసుకున్న ఏజెంట్ కి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంకా ఇతర బాషల డీల్స్ క్లోజ్ కాలేదు.
ఈ నేపథ్యంలో ఏజెంట్ విషయంలో ఏదో ఒక అద్భుతం జరగాల్సిందే. దానికి రెండు కీలకమైన దారులున్నాయి. ఒకటి ఎక్స్ ట్రాడినరి అనిపించే ట్రైలర్ కట్. రెండోది గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్. వీటిని కనక పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే కనక ఉన్న తక్కువ సమయంలోనూ హైప్ ని పెంచేయొచ్చు. పొన్నియన్ సెల్వన్ 2 పోటీ వల్ల ఇతర రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కి దెబ్బ పడేలా ఉంది. కనీసం తెలుగు స్టేట్స్ లో దుమ్ము దులపాలంటే మొదటి రోజు స్క్రీన్లన్నీ కిక్కిరిసిపోయి బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. ఏజెంట్ వీలైనంత త్వరగా మేల్కొని స్పీడు పెంచడం చాలా అవసరం.
This post was last modified on April 13, 2023 2:54 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…