నిన్న ఉన్నట్టుండి ఒక షార్ట్ ఫిలింకి పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ సంగీత దర్శకత్వం వహించాడని తెలిసి పవన్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. రైటర్స్ బ్లాక్ అనే చిన్న షార్ట్ ఫిలింకి తను ఇచ్చిన స్కోర్ గురించి అడవి శేష్ ప్రత్యేకంగా ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ అందరినీ చూడమని కోరాడు. వీడియో చాలా చిన్నది. ఒక వర్ధమాన రచయిత ఏం రాయాలో తెలియని ఒక విచిత్రమైన సందిగ్ధంలో ఉన్నప్పుడు దాన్నుంచి ఎలా బయట పడి కలంని విదిలించాడన్న పాయింట్ మీద దర్శకుడు కార్తికేయ యార్లగడ్డ సింపుల్ గా ప్రెజెంట్ చేశారు. విజువల్స్ బాగున్నాయి
ఆహా ఓహో అనుకునేంత గొప్పగా లేదు కానీ మంచి ఐడియాని ఇలా చేయడం వరకు ఓకే అనిపించింది. తెరమీద అకీరాని చూడాలనుకుంటున్న అభిమానులతో తల్లి రేణుక దేశాయ్ ఈ మధ్య వివాదాస్పదంగా సోషల్ మీడియాలో బదులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో అకీరా మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తడం ఎవరూ ఊహించనిది. అయితే అకీరా కెరీర్ కు సంబంధించిన మొత్తం ప్లానింగ్ పవన్ తనకు బాగా ఇష్టులలో ఒకడైన అడవి శేష్ కి అప్పగించినట్టు ఎప్పటి నుంచో టాక్ ఉంది. రేణు కూడా ఈ నిర్ణయం పట్ల సానుకూలంగా ఉన్నారట.
ఒకవేళ అకీరా నిజంగానే హీరోగా డెబ్యూ చేయాలని ఫిక్స్ అయితే మాత్రం ఆ బాధ్యత తిరిగి అడవి శేష్ మీద ఉండబోతోందని వినికిడి. ప్రొడక్షన్ కంపెనీ, దర్శకుడు, కథలు వగైరా మొత్తం తనే చూసుకోవాల్సి రావొచ్చు. దానికి ఎంత టైం పడుతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత పవన్ కనక ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సి వస్తే అప్పుడు నటనకు విరామం తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే అకీరాను అనుకున్న టైం కన్నా ముందే లాంచ్ చేసే ఆలోచన చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. కుర్రాడి వయసిప్పుడు 19 ఏళ్ళు
This post was last modified on April 13, 2023 1:32 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…