బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న దసరా బృందానికి మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు దక్కాయి. విడుదలైన రెండు వారాల తర్వాత ఈ కాంప్లిమెంట్స్ అందుకోవడం పట్ల న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వసూళ్లు కొంత నెమ్మదించిన టైంలో ఇలాంటి బూస్ట్ ఇచ్చే ట్వీట్లు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. స్వతహాగా దసరా టీమ్ లో అధిక శాతం చిరు అభిమానులే. సినిమా ప్రారంభం సిల్క్ బార్ లో గూండా పాటను ఉపయోగించడాన్ని బట్టే చెప్పొచ్చు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఫ్యానిజం ఏ స్థాయిలో ఉందో.
ఇదొక్కటే కాదు అక్కడక్కడా చిరు రిఫరెన్సులు వాడారు. ఇతని చిన్నప్పుడు మెగాస్టార్ ఫోటో పెట్టుకుని డాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి ఆల్రెడీ వైరల్ అయ్యింది. ఇక నాని విషయానికి వస్తే తన అభిమానం గురించి అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా చిరు మీద ఇష్టాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేస్తూనే వచ్చాడు. కీర్తి సురేష్ ఆల్రెడీ భోళా శంకర్ లో చెల్లిగా నటిస్తోంది. తల్లి మేనక ఒకప్పుడు పున్నమి నాగులో చిరంజీవితో కలిసి నటించిన అరుదైన జ్ఞాపకం ఉంది. సో ఇన్ని కోణాల్లో మెగా కనెక్షన్ ఉన్న దసరా టీమ్ కు స్వయంగా ఆయన నుంచే విషెస్ వస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది.
ట్విట్టర్లో పెట్టిన సందేశంలో చిరంజీవి శుభాకాంక్షలు చెబుతూ దసరా చూశాను, అద్భుతంగా ఉంది, నాని పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు, ఇది దర్శకుడు శ్రీకాంత్ మొదటి సినిమాని తెలిసి ఆశ్చర్యపోయాను, అతని నైపుణ్యం గొప్పగా ఆవిష్కరించబడింది, మహానటి కీర్తి సురేష్ జస్ట్ వావ్, సూరి పాత్ర చేసిన దీక్షిత్ శెట్టి, సంగీతం అందించిన సంతోష్ నారాయణన్, ఇలా మొత్తం టీమ్ కలిసికట్టుగా గొప్ప చిత్రాన్ని ఇచ్చారని మెచ్చుకున్నారు. మొత్తానికి మెగా విషెస్ దసరాకు కొత్త ఊపునిస్తాయి. మూడో వారంలోనూ చాలా సెంటర్స్ లో బలమైన రన్ కొనసాగిస్తున్న ఈ సినిమాకు నెలాఖరు దాకా ఢోకా లేనట్టే
This post was last modified on April 13, 2023 11:33 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…