జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ వేరే హీరోల ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తుంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమానులతో వారికి నిరంతరం ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు తారక్ అభిమానుల్లోనే అంతర్గతంగా గొడవలు జరుగుతుండటం గమనార్హం. ఇందుకు ఎన్టీఆర్ నటించిన రెండు పాత సినిమాలు కారణం అవుతున్నాయి.
టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండు నడుస్తున్న సంగతి తెలిసిందే. తారక్ సినిమాలు కూడా కొన్ని ఈ వరుసలో రిలీజయ్యాయి. ఐతే మే 20న తారక్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈసారి రీ రిలీజ్ ప్లానింగ్ కొంచెం గట్టిగా చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులే లీడ్ తీసుకుని ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నారు. ఐతే ఇందులో ఒక వర్గం ‘సింహాద్రి’ సినిమా స్పెషల్ షోలకు కొంచెం గట్టిగా ప్లాన్ చేసింది. నెల ముందు నుంచే దీని గురించి ప్రమోట్ చేస్తున్నారు. భారీ రిలీజ్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
కానీ తారక్ అభిమానుల్లో ఇంకో వర్గం ‘ఆది’ సినిమా రీ రిలీజ్ కోసం ప్లాన్ చేసుకుంది. వాళ్లు కూడా కొంచెం గట్టిగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఈ విషయంలో రెండు వర్గాల మధ్య పోటీ పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. తారక్ అభిమానులు ఈ సినిమానే చూడాలంటే ఈ సినిమానే చూడాలి అంటూ పరస్పరం ప్రకటనలు రిలీజ్ చేయడం.. ఆయా షోల ప్రత్యేకత గురించి వివరించడం చేస్తున్నారు.
ఇరు వర్గాల వాళ్లూ ఈ షోలు ఛారిటీ కోసమే అంటున్నారు. ‘సింహాద్రి’ షోలతో వచ్చిన డబ్బులతో అనారోగ్యంతో బాధ పడుతున్న తారక్ అభిమానులను ఆదుకుంటామని.. ఈ సినిమా రీ రిలీజ్ పూర్తిగా అభిమానుల చేతుల మీదుగానే జరుగుతోందని.. ఎన్టీఆర్‌ను కూడా కలిసి ఈ షోల గురించి వివరించగా.. ఆయన ప్రోత్సహించారని ఒక వర్గం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ‘ఆది’ స్పెషల్ షోలు వేస్తున్న వాళ్లు కూడా ఇలాగే ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకోవైపేమో తారక్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ షోలకు కూడా ప్రణాళికలు రచిస్తోంది ఇంకో వర్గం. దాని గురించి పెద్దగా పట్టింపు లేదు కానీ.. సింహాద్రి, ఆది సినిమాల్లో తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఏది చూడాలో, దేన్ని ఓన్ చేసుకోవాలో తెలియని అయోమయంలో అభిమానులు పడిపోతున్నారు.
This post was last modified on April 12, 2023 9:08 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…