జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో తొలి ఏడెనిమిదేళ్లు ఎలా ఉన్నాడో.. తర్వాత ఎంతగా మారిపోయాడో తెలిసిందే. ‘రాఖీ’ వరకు పరిమితికి మించి ఉన్న లావుగా కనిపించిన అతను.. ‘యమదొంగ’తో ఒక్కసారిగా చిక్కిపోయి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. ఒక సర్జరీ ద్వారా అతను బాగా బరువు తగ్గాడు. యమదొంగ, కంత్రీ సినిమాల్లో మరీ బక్క చిక్కి కనిపించడం అభిమానులకు కూడా రుచించలేదు. కానీ తర్వాత కొంచెం బరువు పెరిగి పర్ఫెక్ట్ షేప్‌లోకి వచ్చాడు.
ఐతే గత కొన్నేళ్లలో తారక్‌ను పరిశీలిస్తే.. సినిమాకు, సినిమాకు మధ్య విరామంలో అతను కొంచెం అదుపు తప్పుతున్నట్లు కనిపిస్తాడు. వర్కవుట్లు అవీ చేయకపోవడం వల్లో, డైట్ ఫాలో కాకపోవడం వల్లో అతను కొంచెం షేపవుట్ అవుతుంటాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత చాలా గ్యాప్ రావడంతో మరోసారి తారక్ లుక్ కొంచెం తేడా కొట్టినట్లు అనిపించింది. చివరగా ‘అమిగోస్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చినపుడు తారక్‌ను చూసి అభిమానులు కొంచెం కంగారు పడ్డారు.
కొరటాల శివ సినిమా షూటింగ్ దగ్గరపడుతున్నా లుక్ సెట్ చేసుకోలేదేంటని అనుకున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ టైంలో కూడా తారక్ మామూలు లుక్‌లోనే కనిపించాడు. ఈ సినిమాలో బొద్దుగా కనిపించే క్యారెక్టరే చేస్తున్నాడేమో అనుకున్నారు. కానీ కొన్ని వారాల కిందటే ఈ సినిమా షూటింగ్‌కు తారక్ హాజరు కావడం.. చకచకా ఒక షెడ్యూల్ పూర్తి చేయడం జరిగింది. ఈ షూటింగ్ మధ్యలో ఒక అభిమానితో తారక్ దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో తారక్ లుక్ షాకింగ్‌గా అనిపిస్తోంది. బరువు తగ్గి, గడ్డం తీసేసి కనిపించడంతో చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు తారక్. సినిమా ప్రారంభోత్సవం నాటితో పోలిస్తే తారక్ లుక్ పూర్తి భిన్నంగా ఉంది. ఇంతలో ఇంత మార్పు ఏంటి.. తారక్ మేకోవర్ సూపర్ అని అభిమానులు ఎగ్జైట్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on April 12, 2023 4:13 pm
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…