ప్రస్తుతం కొందరు యంగ్ హీరోల సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ అంతా సులువగా జరగడం లేదు. దీనికి రకరకాల కారణాలున్నాయి. అయితే తాజాగా విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకు కూడా రిలీజ్ కి ముందు ఆశించినట్టుగా నాన్ థియేట్రికల్ బిజినెస్ అవ్వలేదు. ఈ సినిమాకు తనే దర్శకుడు కావడం, సొంత బేనర్ లోనే తీయడంతో దీనికి భారీ రేటు చెప్పుకున్నాడు విశ్వక్. అయితే ఈ కుర్ర హీరోకి నాన్ థియేట్రికల్ గా అంతా క్రేజ్ లేకపోవడంతో చిన్న రేట్లు చెప్పి రిలీజ్ కి ముందు కొనకుండా ఊరుకున్నారు.
అయితే రిలీజ్ తర్వాత మాత్రం విశ్వక్ కాస్త తగ్గి బిజినెస్ చేసుకోవాల్సి వచ్చింది. రిలీజయిన వారానికి సినిమాను ఓటీటీ సంస్థకి అమ్మేశాడు. అలాగే శాటిలైట్ కూడా అయిపోయిందని టాక్ వినిపిస్తుంది. ఓటీటీ డీల్ ను ఆహా తో సెట్ చేసుకున్న విశ్వక్ తాజాగా శాటిలైట్ హక్కులను జీ సంస్థకి ఇచ్చేశారని తెలుస్తుంది. ఇలా అటు ఆహా నుండి ఇటు జీ తెలుగు చానెల్ నుండి నిర్మాతగా విశ్వక్ కి ఐదారు కోట్ల దాకా ముట్టాయట.
ఏదేమైనా కుర్ర హీరో రిలీజ్ తర్వాత ముందు చెప్పిన రేటుకి ఇప్పుడు పలికిన రేటుకి చాలా తేడా వచ్చిందని తెలుస్తుంది. అదే రిలీజ్ కి ముందు అంతకో ఇంతకో సెట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వచ్చేది. ఏదేమైనా నిర్మాతగా ఈ సినిమాతో విశ్వక్ అటు థియేట్రికల్ గా ఇటు నాన్ థియేట్రికల్ గా కొంత లాభ పడి నిర్మాతగా సేఫ్ అయినట్టే.
This post was last modified on April 12, 2023 12:40 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…