ప్రస్తుతం యంగ్ హీరోలతో సమానంగా రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు చిరు. రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఎలాంటి బ్రేక్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేసిన మెగాస్టార్ మే నెలలో భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి స్టేజీకి చేరుకుంది. అయితే ఈ సినిమా తర్వాత చిరు కొన్ని నెలలు బ్రేక్ తీసుకోబోతున్నాడు. దానికి కారణం చిరు నెక్స్ట్ సినిమా ఫిక్స్ కాకపోవడమే. అవును మెగా స్టార్ మెగా లైనప్ పెట్టుకున్నారు. కానీ ఏది ఫైనల్ అవ్వలేదు.
కొందరు రైటర్స్ , డైరెక్టర్స్ ఇప్పటికే చిరుకి కొన్ని కథలు వినిపించారు. కానీ చిరు ను ఎగ్జైట్ చేసే ప్రాజెక్ట్ దొరకలేదు. నిజానికి మెహర్ రమేష్ సినిమా తర్వాత చిరు వెంకీ కుడుముల తో దానయ్య బేనర్ లో సినిమా చేయాలి కానీ అది క్యాన్సిల్ అయింది. దానయ్య చిరు కోసం మరో కథ , దర్శకుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. నెక్స్ట్ సినిమా దానయ్య కే చేసే ఛాన్స్ ఉంది. కానీ ఈ లోపు మరో నిర్మాత ఎవరైనా కథ ప్లస్ దర్శకుడితో అప్రోచ్ అయితే మెగా స్టార్ అటు వెళ్లిపోయే అవకాశం ఉంది.
ఏదేమైనా ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య గా థియేటర్స్ లోకి వచ్చిన చిరు ఐదు నెలలోపే భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక మెగా స్టార్ నుండి వచ్చే నెక్స్ట్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తర్వాతే ఉండవచ్చు. భోళా తర్వాత కొన్ని నెలలు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మరో సినిమాను సెట్స్ పైకి తెస్తారు చిరు.
This post was last modified on April 12, 2023 12:38 pm
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…
ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…
ఐపీఎల్లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…