వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు బాబీ కొత్త సినిమా ఏదనే సస్పెన్స్ కొనసాగుతూనే వచ్చింది. అది విడుదలై మూడు నెలలు దాటినా ఇప్పటిదాకా అనౌన్స్ మెంట్ లేదు. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడనే వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అది కూడా దిల్ రాజు నిర్మాత అనగానే అంచనాలు అప్పుడే మొదలైపోయాయి. అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఖరారు చేయలేం కానీ నిప్పులేనిదే పొగరాదనే సామెతను మర్చిపోకూడదు. అదే జరిగితే బాబీ నక్క తోక తొక్కినట్టే.
వరసగా మెగాస్టార్, తమిళ సూపర్ స్టార్ లను డీల్ చేయాల్సి రావడం చాలా కొద్దిమందికే దక్కే అదృష్టం. వినడానికి బాగానే ఉంది కానీ తలైవా ఇమేజ్ ని బాబీ మోయగలడా అనే సందేహాలు అభిమానులకు వస్తున్నాయి. ఎందుకంటే ఇతనికి హిట్లు ఎన్నున్నాయని పక్కనపెడితే యునానిమస్ గా కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ ని గొప్పగా డీల్ చేశాడనే పేరు ఎప్పుడూ రాలేదు. ఇద్దరు హీరోలున్నా వెంకీ మామ యావరేజ్ అయ్యింది. జై లవకుశ కథా కథనాల కంటే జూనియర్ ఎన్టీఆర్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ వల్ల ఎక్కువ ఆడింది. సర్దార్ గబ్బర్ సింగ్ గురించి తెలిసిందే.
పవర్ ఒకటే చెప్పుకోదగ్గ విజయం. మరి ఇలాంటి ట్రాక్ రికార్డుతో బాబీ రజినిని బాలన్స్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే కోలీవుడ్ లో ఎంతో పేరున్న సిరుతై శివ(పెద్దన్న), మురుగదాస్(దర్బార్), కార్తీక్ సుబ్బరాజ్(పేట), పా రంజిత్(కాలా-కబాలి)లు ఆయన్ని సరిగ్గా వాడుకోలేక ఫ్లాప్ నుంచి సూపర్ హిట్ మధ్యలో ఫలితాలు అందుకున్నారు తప్ప యునానిమస్ బ్లాక్ బస్టర్లు కొట్టలేదు. మరి వాళ్ళ వల్లే కానిది బాబీ ఎంత మేరకు హ్యాండిల్ చేయగలడో చూడాలి. వాల్తేరు వీరయ్య చూసి రజిని సానుకూలంగా స్పందించారా లేక ఇంకేదైనా కారణముందా లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on April 12, 2023 12:33 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…