సూపర్ స్టార్ మహేష్ బాబు తన నిర్ణయాల పట్ల ఎంత నిక్కచ్చిగా ఉంటారో ఫ్యాన్స్ కే కాదు ఆయనతో దగ్గరగా మసిలే అందరికీ తెలుసు. పుష్ప ముందు వెళ్ళింది తన దగ్గరికే. సుకుమార్ ఎంత కన్విక్షన్ తో స్క్రిప్ట్ వినిపించినా ఆ పాత్ర అభిమానుల అంచనాలకు మ్యాచ్ కాదని చాలా అలోచించి చివరికి నో చెప్పారు. తర్వాత అది అల్లు అర్జున్ తప్ప ఇంకెవరికీ సూట్ కాదని అక్షరాలా ఋజువయ్యింది. తాజాగా విడుదల పార్ట్ 1 ప్రీమియర్ షో ప్రెస్ మీట్ సందర్భంగా దర్శకుడు వెట్రిమారన్ చెప్పిన ఒక ముచ్చట మరోసారి దీన్ని ఖరారు చేసింది. గతంలో ఒక కథ కోసం ఇద్దరూ కలుసుకున్నారట.
వడ చెన్నైకు ముందు వెట్రిమారన్ బన్నీతో పాటు మహేష్ నూ కలిశాడు. కానీ ఈయన చెప్పిన లైన్లు నచ్చకో లేక ఆయన స్టైల్ హీరోయిజంని ఇక్కడ ఒప్పుకోరనే వాస్తవాన్ని గుర్తించవడం వల్లో చివరికది కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ ఈ కాంబో కనక సెట్ అయ్యుంటే మేకింగ్ ఎంత గొప్పగా ఉన్నా మన ఆడియన్స్ ఆ తరహా మేకింగ్ ని రిసీవ్ చేసుకోవడం కష్టం. జాతీయ అవార్డులు సాధించిన ఆడుకాలం, విసరనై తెలుగు డబ్బింగులు కనీస స్థాయిలో ఆడకపోవడం కన్నా ఉదాహరణ అక్కర్లేదు. మహేష్ లాంటి స్టార్లను వెట్రిమారన్ డీల్ చేయలేరు.
ఎలా చూసినా మహేష్ నిర్ణయాలు సరైనవే. కొన్ని కాంబోలు వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా మారితే ఇబ్బందే. అందుకే అంతా మన మంచికే అనుకోవాలి. విడుదల పార్ట్ 1 ప్రమోషన్ల కోసం టీమ్ తో సహా హైదరాబాద్ వచ్చిన వెట్రిమారన్ ఈ సారి టాలీవుడ్ ఫ్యాన్స్ తనను ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారు. పచ్చి నిజాలను అంతే పచ్చిగా తెరమీద చూపిస్తారని పేరున్న ఈ కల్ట్ దర్శకుడి మేకింగ్ ని ఇక్కడి జనాలకు ఎంత మేరకు కనెక్ట్ అవుతుందన్నది చూడాలి. తమిళనాడులో గత నెల 31న రిలీజైన విడుతలైకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే దక్కాయి.
This post was last modified on April 12, 2023 10:27 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…