గత ఏడాది ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాల దెబ్బకు రవితేజ కెరీర్ కుదేలైనట్లు కనిపించింది. కానీ ఆ ప్రభావం ఏమీ కనిపించనివ్వకుండా ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. డివైడ్ టాక్‌తోనూ ఈ సినిమా వంద కోట్ల వసూళ్ల మార్కును దాటడం అనూహ్యం. మాస్ రాజా ఈ ఆనందంలో ఉండగానే ఆయన ప్రత్యేక పాత్ర చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సైతం ఘనవిజయాన్నందుకుంది. ఈ దెబ్బతో మళ్లీ కెరీర్ పీక్స్ అందుకున్నట్లే కనిపించాడు రవితేజ. ఈ ఊపులో ఇంకో హిట్ కొడితే రవితేజ దశ తిరిగిపోయేది.
కానీ మాస్ రాజా కొత్త చిత్రం ‘రావణాసుర’ ఆయన జోరుకు బ్రేక్ వేసేసింది. ఎంన్దుకో ఈ సినిమాపై ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు. రిలీజ్ ముంగిట అంతగా హైప్ కూడా కనిపించలేదు. అందుకు తగ్గట్లే సినిమాకు మంచి టాక్ కూడా రాలేదు. కాకపోతే మాస్ రాజా ఊపు వల్ల ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి.
మూడు రోజుల తొలి వీకెండ్లో ‘రావణాసుర’ వరల్డ్ వైడ్ రూ.9 కోట్లకు కాస్త ఎక్కువగా షేర్ రాబట్టింది. మాస్ రాజా రేంజికి ఇది చిన్న ఫిగరే. కానీ సినిమాకు వచ్చిన టాక్‌తో పోలిస్తే పర్వాలేదని చెప్పాలి. వీక్ డేస్‌లో సినిమా కాస్త నిలబడితే.. బయ్యర్లు సేఫ్ జోన్‌లోకి రావడానికి ఛాన్సుంటుందని అనుకున్నారు. కానీ డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా, పైగా ప్రమోషన్ల ద్వారా పుష్ చేసే ప్రయత్నమూ జరగట్లేదు. దీంతో సోమవారం ‘రావణాసుర’ క్రాష్ అయిపోయింది.
సినిమాకు నాలుగో రోజు వరల్డ్ వైడ్ కోటి రూపాయల షేర్ కూడా రాని పరిస్థితి. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ షేర్స్ నామమాత్రంగా ఉండటంతో ఓవరాల్ కలెక్షన్ల ఫిగర్లు కూడా సరిగా రావట్లేదు. సినిమా సోమవారం మార్నింగ్ షోలతో పడుకుండిపోయిందని.. ఇక లేవదని అర్థమైపోయింది. సాయంత్రం షోలకు కూడా పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో ‘రావణాసుర’ డిజాస్టర్ అనే విషయం ఖరారైపోయినట్లే.
This post was last modified on April 11, 2023 5:46 pm
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…