Movie News

ఉబ్బితబ్బిబ్బవుతున్న బన్నీ

పిల్లలు పుట్టినప్పటి కంటే వాళ్లు ప్రయోజకులైనపుడు తల్లిదండ్రులు ఎక్కువ ఆనంద పడాలని అంటారు. ఐతే కొంతమంది పిల్లలుగా ఉండగానే తల్లిదండ్రులు గర్వించేలా, పొంగిపోయేలా చేస్తారు. అల్లు అర్జున్ కూతురు అర్హ విషయంలో ‘గర్వించడం’ లాంటి పెద్ద పదాలు వాడలేం కానీ.. తన తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బయ్యేలా మాత్రం చేస్తోందట ఆ చిన్నారి. బన్నీ పెట్టే క్యూట్ ఫొటోలు, వీడియోలతో ఇప్పటికే నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షించిన అర్హ.. ఇప్పుడు తొలిసారిగా వెండితెరపై మెరవబోతోంది.

‘శాకుంతలం’తో అర్హ బాల నటిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్లో సింహం మీద వస్తున్న దృశ్యంలో చాలా ముద్దుగా కనిపించి ఆకట్టుకున్న అర్హ.. సినిమాలో తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెస్మరైజ్ చేయబోతున్నట్లు సమాచారం. సోమవారం రాత్రి ప్రసాద్ ఐమాక్స్‌లో ‘శాకుంతలం’ స్పెషల్ త్రీడీ ప్రిమియర్ వేశారు.

ఇండస్ట్రీ, మీడియా నుంచి ప్రత్యేక అతిథులను పిలిచి ఈ షో వేశారు. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందన్న టాక్ బయటికి రాలేదు కానీ.. ఈ షో చూసిన వాళ్లందరూ ముక్త కంఠంతో చెబుతున్న అల్లు అర్హ సూపర్ అని. ఇందులో దుష్యంతుడి కొడుకు పాత్రలో అర్హ కనిపించనుందట. కెమెరా ముందు ఏమాత్రం తడబడకుండా, బెరుకు లేకుండా అర్హ నటించిందని.. డైలాగులు చాలా బాగా చెప్పిందని.. క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్ అనిపించేలా తన ఎపిసోడ్ ఉందని షో చూసిన వాళ్లు చెబుతున్నారు. అర్హ కనిపించింతసేపు ఎవ్వరూ చూపు తిప్పుకోలేరని అంటున్నారు. సినిమాకు మేజర్ హైలైట్లలో ఈ ఎపిసోడ్ ఒకటిగా చెబుతున్నారు.

ఈ షో అయ్యాక చాలామంది బన్నీకి కాల్స్, మెసేజ్ చేసి అర్హ పెర్ఫామెన్స్ గురించి పొగిడారని.. ఫీడ్ బ్యాక్ అంతా తనకు వెళ్లిందని.. దీంతో అల్లు హీరో ఆనందంతో పొంగిపోయాడని సన్నిహితుల సమాచారం. ఈ నెల 14న సినిమా చూడబోతున్న ప్రేక్షకులందరూ కూడా అర్హను కొనియాడటం ఖాయమని, అప్పుడు బన్నీ ఆనందం రెట్టింపవుతుందని అంటున్నారు.

This post was last modified on April 11, 2023 5:44 pm

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

31 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

50 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

54 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

5 hours ago