సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నా, గొడవపడినా, విడాకులు తీసుకున్నా ఇలా ఏం చేసినా న్యూసే. కాకపోతే కొన్ని నేరుగా చెప్పరు. వాళ్ళ చర్యల ద్వారా మనమే అర్థం చేసుకోవాలి. మెగా బ్రదర్ నాగబాబు తనయ నీహారిక వివాహ బంధం విడిపోయే దాకా వచ్చిందని గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ జంట సోషల్ మీడియా అకౌంట్లలో సందర్భం లేకుండా ఫోటోలను డిలీట్ చేసుకోవడం లాంటి పనుల వల్ల ఫ్యాన్స్ కి మ్యాటరేంటో సులభంగానే అర్థమైపోయింది. కాకపోతే ఖచ్చితంగా ఏం జరిగిందనే వివరణ మెగా వర్గాల నుంచి రాలేదు. తాజాగా నీహారిక మరో క్లారిటీ ఇచ్చింది
రెండు రోజుల క్రితం వరకు ఇన్స్ టాలో ఉన్న భర్త వెంకట చైతన్యకు సంబంధించిన ఫొటోలన్నీ డిలీట్ కొట్టేసింది. అంతే కాదు అతన్ని అన్ ఫాలో కూడా చేసుకుంది. ఇలా పరస్పరం తమ వ్యతిరేకతను బయట పెట్టుకున్న ఈ దంపతులు త్వరలో డైవర్స్ కు వెళ్తారని సమాచారం. ఇదంతా లీగల్ గా జరగాల్సిన వ్యవహారం కాబట్టి ఒక కొలిక్కి వచ్చాక పబ్లిక్ కి చెప్పే అవకాశం ఉంది. ఈ విషయంలో నిహారిక సమంతను ఫాలో అయ్యేలా ఉంది. ఊరికే తొందరపడి ఏదో ఒకటి చెప్పేయకుండా అన్నీ అయ్యాక స్పష్టంగా సోషల్ మీడియాలో చెప్పేస్తే ఏ గొడవా ఉండదు
ఈ వ్యవహారం పట్ల నాగబాబు స్పందన ఎక్కడా లేదు. చిరంజీవి వీటి పట్ల ముందు నుంచి ఓపెన్ గా మాట్లాడరు కాబట్టి ఏదున్నా అంతర్గతంగానే ముగిసిపోనుంది. ఇప్పటికీ కళ్యాణ్ దేవ్ శ్రీజల బంధం గురించి ఎన్ని వార్తలు వచ్చినా మౌనంగా ఉన్నారు తప్పించి అసలు కలిసే ఉన్నారని కానీ విడిగా ఉన్నారని కానీ చెప్పలేదు. అల్లుడు బ్రాండ్ తో సినిమాలు చేసుకుంటూ వచ్చిన కళ్యాణ్ దేవ్ కి ఇప్పుడు అవకాశాలే లేవు. వచ్చినవన్నీ డిజాస్టర్లే అయ్యాయి. నీహారిక ఇకపై ప్రొడక్షన్లో బిజీ కానుందని తన కొత్త ఆఫీస్ ఫోటోలను పోస్ట్ చేయడం బట్టి స్పష్టత వచ్చేసింది
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…