చిన్న పిల్లలైనా సరే స్టార్ హీరోల పిల్లలు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నప్పుడు అభిమానుల్లో ఒకరకమైన ఉత్సుకత ఉంటుంది. నాన్నకు తగ్గట్టు నటించారా లేదా, స్క్రీన్ ప్రెజెన్స్ లో పోలికలు ఎలా అనిపించాయి లాంటి ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటారు. మహేష్ వారసుడు గౌతమ్ 1 నేనొక్కడినేలో డెబ్యూ చేసినప్పుడు అందరి ఫోకస్ ఆ అబ్బాయి మీదే పడింది. సర్కారు వారి పాట టైంలో సితార డాన్స్ చేసిన పాటని ప్రమోషన్లకు వాడుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ చాలా చిన్న వయసులోనే శాకుంతలంతో తాత, తండ్రి నడిచిన బాట పట్టేసింది.
ఎలాగూ స్పెషల్ ప్రీమియర్లు హైదరాబాద్ లో మొదలైపోయాయి కాబట్టి అర్హ పాత్రకు సంబంధించిన లీక్స్ బయటికి వచ్చేశాయి. పాప ప్రీ క్లైమాక్స్ లో వస్తుంది. ట్రైలర్ లో చూపించినట్టే సింహం మీద కూర్చునే సీన్ తోనే పరిచయం చేస్తారు. ఆ తర్వాత దుశ్యంత మహారాజుని సవాల్ చేస్తూ చెప్పే డైలాగులు, దంపతుల పట్టాభిషేకం తర్వాత రాజ్యంలోని ప్రజలకు హామీ ఇచ్చే భరతుడిగా అర్హ చెప్పే మాటలు చాలా బాగా వచ్చాయి. క్లిష్టంగా అనిపించే పౌరాణిక టచ్ తో ఉన్న సాయిమాధవ్ బుర్ర సంభాషణలను ఇంత లేత వయసులో అర్హ పలికిన విధానం ఆశ్చర్యపరిచే మాట వాస్తవం.
క్యారెక్టర్ నిడివి పది నిమిషాలే అయినా అర్హ ఉన్నంతసేపు సందడిగా సాగుతుంది. ఉచ్చారణ దోషం లేకుండా డబ్బింగ్ కూడా చాలా చక్కగా వచ్చింది. ఆమధ్య అంజలి సినిమాలో టైటిల్ సాంగ్ కి కవర్ వీడియో చేసి ఆకట్టుకున్న అర్హ తన తొలి టెస్టులో పాసైనట్టే. శాకుంతలం బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుందో తేలడానికి ఇంకో మూడు రోజులు టైం పడుతుంది కాబట్టి కామన్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలియడానికి శుక్రవారం దాకా వేచి చూడాలి. అల్లు అరవింద్ తో పాటుగా బన్నీ ఫ్యామిలీ మొత్తం స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరు కాబోతున్నారట.
This post was last modified on April 11, 2023 8:26 am
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…