వచ్చే నెల మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి రీ రిలీజ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ప్రత్యేకంగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన ఇండస్ట్రీ హిట్ ని మళ్ళీ తెరపై చూడబోతున్నామంటూ అభిమానులు పోస్టర్లను ప్రత్యేకంగా కట్ చేసిన టీజర్ వీడియోను వైరల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ అనడం గురించి ఇతర హీరోల ఫ్యాన్స్ కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు దీని మీద సోషల్ మీడియా డిబేట్లు మొదలుపెట్టారు.
2003లో థియేటర్ యుఫోరియాని ప్రత్యక్షంగా చూసినవాళ్లకు మాత్రమే సింహాద్రి ఏ స్థాయిలో బ్లాక్ బస్టరో అర్థమవుతుంది. అప్పటికి కెరీర్ పరంగా ఇంకా తొలి అడుగుల్లోనే ఉన్న తారక్ ని ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి లాకొచ్చిన ఆల్ టైం మాస్ హిట్ ఇది. పాతిక కోట్లకు పైగా వసూళ్ల షేర్ తో బాక్సాఫీస్ ని షేక్ చేయడం అత్యధిక కేంద్రాల్లో వంద రోజులు (150), సిల్వర్ జూబ్లీలు(55) చేసుకోవడం అంతా చరిత్రలో ఉన్నదే. కొత్తగా పుట్టించిందేమీ కాదు. అయితే ఇండస్ట్రీ హిట్ అనే పదానికి నిర్వచనం ట్రేడ్ ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఇవ్వడం వల్లే కొంత అయోమయం నెలకొంటుంది.
గత సినిమాల అత్యధిక వసూళ్లను దాటినవి మొదటి క్యాటగిరీ అయితే ఎక్కువ కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ చేసుకున్నవి రెండో విభాగం. సింహాద్రి ఇది రిలీజైన 2003 నాటికి ఇక్కడ చెప్పిన వాటిలో సెకండ్ జోన్ లోకి వస్తుంది. ఎలా చూసుకున్నా టాలీవుడ్ ఆల్ టైం హిట్స్ లో దీనికి చోటున్న మాట వాస్తవం. చాలా సెంటర్స్ లో హయ్యెస్ట్ నెంబర్స్ నమోదు చేయడం గురించి నిర్మాత వి దొరస్వామిరాజు పలు ఇంటర్వ్యూలలో స్పష్టంగా చెప్పారు. ఏ సినిమాకైనా కలెక్షన్ల లెక్కలన్నీ నిజమేనని చెప్పడానికి పక్కా ఆధారాలు ఉండవు. ఆలా అని సింహాద్రి విజయాన్ని ఏ కోణంలోనూ తక్కువ చేయడానికి లేదు.
This post was last modified on April 10, 2023 5:15 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…