ఈ రోజుల్లో ఒక స్టార్ హీరో వరుసగా రెండు బ్లాక్‌బస్టర్లు ఇవ్వడం అరుదైన విషయం అయిపోయింది. అందులోనూ డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో భారీ విజయాలను అందుకుంటే చర్చనీయాంశంగా మారకుండా ఎలా ఉంటుంది? మాస్ రాజా రవితేజ విషయంలో అదే జరిగింది. గత ఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్లు కావడంతో ఆయన పని అయిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ముఖ్యంగా ‘రామారావు’ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం.. అది పూర్తిగా బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోవడంతో రవితేజ మార్కెట్ దారుణంగా దెబ్బ తినేసినట్లు కనిపించింది. కానీ అందరికీ పెద్ద షాకిస్తూ ఏడాది చివర్లో ‘ధమాకా’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు రవితేజ. ఈ సినిమాకు అంత మంచి టాక్ ఏమీ రాకున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనూహ్యమైన నంబర్స్ నమోదయ్యాయి. తర్వాత మూడు వారాలకే ప్రత్యేక పాత్ర చేసిన ‘వాల్తేరు వీరయ్య’తోనూ మరో ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు మాస్ రాజా.
డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో ఇంత తక్కువ గ్యాప్‌లో భారీ విజయాలు అందుకునేసరికి రవితేజకు దిష్టి తగిలేసినట్లుంది. ఆయన కొత్త సినిమా ‘రావణాసుర’కు ఎందుకో సరైన హైప్ రాలేదు. సినిమాకు వచ్చిన టాక్.. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. తొలి రోజు ‘రావణాసుర’ రూ.5 కోట్ల దాకా షేర్ రాబట్టగా.. రెండో రోజు అందులో వసూళ్లు సగానికి సగం తగ్గిపోయాయి. ఆదివారం ఓ మోస్తరుగా వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీకెండ్ మొత్తానికి ఈ సినిమా షేర్ రూ.10 కోట్ల వరకు ఉండొచ్చు.
సినిమాకు డివైడ్ టాక్ ఉన్న నేపథ్యంలో సోమవారం నుంచి నిలబడ్డం కష్టమే. ‘ధమాకా’ తొలి వీకెండ్లో రాబట్టిన వసూళ్లతో పోలిస్తే ‘రావణాసుర’ కలెక్షన్లు సగం మాత్రమే వచ్చేలా ఉన్నాయి. అనుకోకుండా రవితేజ ఖాతాలో రెండు బ్లాక్‌బస్టర్లు పడేసరికి ఆయనకు దిష్టి తగిలేసినట్లుందని.. రాబోయే సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’తో మాస్ రాజా గట్టిగా కొడతాడని అభిమానులు అంటున్నారు. నిజానికి ‘రావణాసుర’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసేస్తుందని రవితేజకు కూడా పెద్దగా ఆశలు లేవన్నది సన్నిహితుల సమాచారం.
This post was last modified on April 9, 2023 10:01 pm
టాలీవుడ్ దర్శకుల్లో కొత్త కథలతో ప్రయాణం చేస్తూ, ఒక కన్విక్షన్‌తో సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ పేరు ముందు వరుసలో…
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయాడు విజయ్.…
నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ఎక్కడ చూసినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వీడియోనే…
ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ హాస్టల్ లో నిద్రస్తున్న విద్యార్థినుల జడలు కత్తిరించడం కలకలం రేపింది. కేవలం సింగిల్ జడ…
ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమా పెద్ద హిట్టయిందంటే.. ఆ చిత్రానికి కలిసొచ్చిన పాయింట్లేంటో చూసుకుని… ఆ అంశాలు తమ చిత్రాల్లో…
వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ మన హైదరాబాద్‌కు రాబోతోందనే వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. టాలీవుడ్ స్టార్…