విజయ్ దేవరకొండ, సమంత కలయికలో ‘ఖుషి’ సినిమా మొదలైనపుడు చాలా ఎగ్జైట్మెంట్ కనిపించింది ప్రేక్షకుల్లో. విజయ్, సమంత ఎవరికి వాళ్లు మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్లు. వీరి కాంబినేషన్లో లవ్ స్టోరీ అంటే మంచి అంచనాలుంటాయి. పైగా ‘ఖుషి’ లాంటి ఎవర్ గ్రీన్ టైటిల్ పెట్టారు. అందులోనూ ‘నిన్ను కోరి’; ‘మజిలీ’ లాంటి మంచి లవ్ స్టోరీలు తీసిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం.. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బేనర్లో సినిమా తెరకెక్కుతుండటంతో అంచనాలు ఇంకా పెరిగాయి.
ఐతే ఆరంభంలో చకచకా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి తర్వాత బ్రేకులు పడ్డాయి. ముందేమో ‘లైగర్’ ప్రమోషన్ల కోసం విజయ్ బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాతేమో సమంత అనారోగ్యం వల్ల షూట్ నిరవధికంగా వాయిదా పడింది. ఐతే ఈ మధ్యే సమంత అందుబాటులోకి రావడంతో ‘ఖుషి’ చిత్రీకరణ పున:ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సినిమా ప్రోగ్రెస్ గురించి దర్శకుడు శివ నిర్వాణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సమంత అందుబాటులోకి రావడంతో యూనిట్ అంతా కలిసి కశ్మీర్ వెళ్లిందని.. అక్కడ 30 రోజుల పాటు విరామం లేకుండా షూటింగ్ చేశామని.. హైదరాబాద్‌లో కూడా కొంత షూట్ జరిగిందని.. దీంతో సినిమా దాదాపుగా పూర్తి కావచ్చిందని శివ తెలిపాడు. అనుకున్న ప్రకారమే సెప్టెంబరు 1న ఈ చిత్రం విడుదలవుతుందని స్పష్టం చేశాడు. ‘ఖుషి’లో హీరోయిన్ పాత్ర రాస్తున్నపుడే దీనికి సమంత తప్ప ఎవ్వరూ న్యాయం చేయలేరనిపించి ఆమెనే ఆ పాత్రకు ఎంచుకున్నట్లు చెప్పాడు.
విజయ్ తన పాత్రకు ప్రాణం పోశాడని.. సమంతతో అతడి కెమిస్ట్రీనే సినిమాకు మేజర్ హైలైట్ అని శివ అన్నాడు. ఇక ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ సినిమా ఎవర్ గ్రీన్ టైటిల్ పెట్టడం గురించి శివ స్పందిస్తూ.. నిజానికి ఆ టైటిల్ మనసులో ఉన్నప్పటికీ.. అది వద్దని వేరే టైటిళ్లు చాలా ప్రయత్నించామని.. కానీ ‘ఖుషి’ తప్ప ఇంకేదీ యాప్ట్ అనిపించకపోవడంతో దాన్నే ఫైనల్ చేశామని.. ‘ఖుషి’ లాగే ఇది కూడా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని శివ తెలిపాడు.
This post was last modified on April 9, 2023 10:02 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…