సినీ రంగంలో ఆడ, మగ సమానత్వం గురించి తరచుగా చర్చ జరుగుతుంటుంది. ఎవరు ఔనన్నా కాదన్నా సినీ రంగంలో పురుషాధిక్యత ఎక్కువ అనడంలో సందేహం లేదు. సంఖ్యా పరంగా చూసుకున్నా.. సంపాదన కోణంలో చూసినా మగాళ్లదే తిరుగులేని ఆధిపత్యం కనిపిస్తుంది ఇక్కడ. ఐతే గతంతో పోలిస్తే మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయి. వారి ఆదాయం కూడా పెరుగుతోంది. అయినా సరే.. మగాళ్లతో పోలిస్తే అంతరం చాలా కనిపిస్తుంది. ఈ తేడాలపై కొందరు హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
డిమాండ్ ఉన్న కథానాయికలు పారితోషకాలు ఎక్కువగా డిమాండ్ చేస్తుంటారు. కానీ అందరికీ ఆ స్కోప్ ఉండదు. చాలామంది ఈ వివక్షపై నోరు విప్పరు కానీ.. కొందర మాత్రం ఓపెన్ అవుతుంటారు. బాలీవుడ్లో చేసే పాత్రల విషయంలోనే కాక మాటల్లోనూ బోల్డ్‌నెస్ చూపించే రాధికా ఆప్టే.. తాజాగా సినీ రంగంలో మహిళలకు తక్కువ ప్రాధాన్యం, పారితోషకాలు ఇవ్వడంపై స్పందించింది.
సినీ రంగంలో హీరోయిన్లతో పాటు ఇక్కడ పని చేసే మహిళలు అందరికీ.. పురుషులతో సమానంగా పారితోషకాలు ఉండాలని ఆమె అభిప్రాయపడింది. డబ్బుతో పాటు పేరు కూడా మహిళలకు పురుషులతో సమానంగా దక్కాలని డిమాండ్ చేసింది. గతంతో పోలిస్తే పరిస్థితులు మారాయని.. ఈ రంగంలో పురుషులతో సమానంగా నిలబడేందుకు మహిళలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పింది. ఇది అందరూ స్వాగతించాల్సిన విషయమని అంది.
ప్రస్తుతం అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లోనూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు పెరుగుతున్నాయని.. మహిళల పాత్రలకు ప్రాధాన్యం దక్కుతోందని.. ఇది శుభ పరిణామమని రాధిక పేర్కొంది. ఇతర రంగాల్లోనూ ఆడ, మగ అంటే తేడా లేదు అనే భావన పెరుగుతోందని.. మహిళలు అన్ని విధాలుగా సమానత్వం కోసం పోరాడుతున్నారని.. ఆ మార్పు మంచిదే అని రాధిక అంది.
This post was last modified on April 9, 2023 5:18 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…