కొత్త సినిమాల ఫలితాలు ఈ మధ్య అంచనాలకు తగ్గట్టూనే నమోదవుతున్నాయి. విడుదలకు ముందున్న వాతావరణం, బజ్ ని ప్రతిబింబిస్తూ వసూళ్లు వస్తున్నాయి. మొన్న శుక్రవారం వచ్చిన రిలీజులు రెండు పాఠాలు నేర్పించాయి. మొదటిది రావణాసుర. రవితేజ లాంటి మాస్ హీరోని ఏదో కొత్తగా చూపించాలని తాపత్రయపడి కిల్లర్ గా మార్చి రివెంజ్ డ్రామాని జోడించడం వల్ల మాస్ కి కనెక్ట్ కాలేమని మొదటి రోజే అర్థమైపోయింది. మాస్ మహారాజా ఇమేజ్ వల్ల అయిదు కోట్లకు దగ్గరగా ఓపెనింగ్ ఫిగర్ వచ్చింది కానీ ఆదివారం తర్వాత ఎలాంటి అద్భుతాలు జరిగే అవకాశం లేనట్టే.
ఓటిటిలో ఇలాంటి క్రైమ్ కథలను బోలెడు చూస్తున్న ఆడియన్స్ కి రావణాసుర లాంటివి చాలా మాములుగా అనిపిస్తాయి. పైగా ఆల్బమ్ కూడా నెగటివ్ కావడం డ్యామేజ్ ని ఇంకా పెంచింది. రెండోది మీటర్. ఏ హీరో అయినా తన బలాలు బలహీనతలు చూసుకోకుండా కమర్షియల్ జానర్ లోకి బలవంతంగా జొరబడాలని చూస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో కిరణ్ అబ్బవరంకు ప్రత్యక్షంగా తెలిసి వస్తోంది. మొదటి రోజే డెఫిషిట్లు పడటం, హైదరాబాద్ లాంటి నగరంలోనూ రెండో రోజు షోలు క్యాన్సిల్ కావడం మాములు షాక్ కాదు. కనీస మద్దతు దక్కలేదు.
జరిగిన అతి తక్కువ థియేట్రికల్ బిజినెస్ లోనూ సగం కూడా అందుకునేలా లేకపోవడం మీటర్ ని పెద్ద డిజాస్టర్స్ లిస్టులోకి చేర్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అంశాలు కొన్నున్నాయి. స్టార్లను ఎప్పుడూ ఓవర్ సీరియస్ గా చూపించకూడదు. పాటల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం మొదటి రోజే ఉంటుంది. కుర్ర హీరోలు తమకు సూటయ్యే క్యారెక్టర్ల పట్ల శ్రద్ధ వహించాలే తప్ప దర్శకుడు ఎగ్జైట్ అయ్యేలా చెప్పాడని టెంప్ట్ అయితే మాత్రం ఉన్న మార్కెట్ గోవిందా కొట్టేస్తుంది. ఈ వారం శాకుంతలం, రుద్రుడు, విడుదల పార్ట్ 1 జాతకాలు ఎలా ఉండబోతున్నాయో.
This post was last modified on April 9, 2023 5:19 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…