Allu Arjun
హీరోల ఫ్యాన్స్ అభిమానం రాను రాను ముదిరి పాకాన పడుతోంది. సోషల్ మీడియాలో ఫేక్ ఐడిలతో అవతలి వాళ్ళను గేలి చేయడమే టార్గెట్ గా పెట్టుకుని పరస్పరం కవ్వించుకునే పనిలేని బ్యాచులు పెరిగిపోతున్నాయి. నిన్న అల్లు అర్జున పుట్టినరోజు సందర్భంగా చిరంజీవితో మొదలుపెట్టి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరూ ట్విట్టర్ లో విష్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీళ్లకు సమాధానం చెప్పే విషయంలో బన్నీ సమయపాలన కొంచెం అటుఇటు అయ్యింది. అంతే దానికి నానార్ధాలు తీసి ట్రోలింగ్ మొదలుపెట్టారు సదరు యాంటీ ఫ్యాన్స్.
చిరంజీవికి లేట్ గా బదులిచ్చాడని, తారక్ ని బావాని సంబోధించి పార్టీకి వస్తానని చెప్పాడని, చరణ్ ని కేవలం స్వీట్ బ్రదర్ అని సరిపుచ్చాడని ఇలా రకరకాల కారణాలతో నిందారోపణలు చేయడం మొదలుపెట్టారు. మెగా అల్లు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం గురించి గత కొన్ని నెలలుగా ఏవేవో ప్రచారాలు జరుగుతూనే వచ్చాయి. అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ రావడం, తన ప్రసంగంతో ఆకట్టుకోవడం, అల్లు అర్జున్ తదితరులంతా ఎంజాయ్ చేయడం ఇవన్నీ అందరూ యూట్యూబ్ వీడియోల సాక్షిగా చూసినవే.
అలీతో సరదాగా ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ ఈ విషయం మీద క్లారిటీ కూడా ఇచ్చారు. అయినా అభిమానులు వీటితో సంతృప్తి చెందడం లేదు. బన్నీ మునుపటిలా లేడని మెగా ఫ్యాన్స్ అంటుంటే, లేదు చరణ్ వైపు నుంచే సమస్య ఉందని ఐకాన్ ఫాలోయర్స్ ఫిర్యాదు. వాస్తవం ఎవరికీ తెలియదు. వీళ్లందరి అభిప్రాయాలు తప్పయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు నిజాలు తెలియకుండానే ఇలా తొందపాటుతో ట్విట్టర్ లో కవ్వించుకునే ప్రయత్నాలు చేయడం సబబు కాదు. ఇదంతా అర్థం చేసుకునే పరిణితి ఉంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది.
This post was last modified on April 9, 2023 10:53 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…