సమంతతో గుణ శేఖర్ తీసిన ‘శాకుంతలం’ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజవుతుంది. మైథాలాజికల్ స్టోరీతో సామ్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టి కొచ్చి , ముంబై , చెన్నై , బెంగళూర్ టూర్లు తిరుగుతున్నారు. టీంతో కలిసి సామ్ ప్రతీ ఈవెంట్ లో పాల్గొంటుంది. అయితే శాకుంతలం కి రావలసిన బజ్ మాత్రం దక్కడం లేదు।
టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ఇలా ఏవి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. దీంతో ఇప్పుడు గుణ శేఖర్ , దిల్ రాజు సక్సెస్ ఐడియాను వెతుక్కుంటూ ప్రీమియర్ షోలు వేసే ఆలోచనలో ఉన్నారు. మేజర్ , రైటర్ పద్మభూషణ్ , బలగం ఇలా ఈ మధ్య చాలా హిట్ సినిమాలను ప్రేక్షకులకు ముందే చూపించారు. అంతెందుకు సార్ విషయంలో కూడా ప్రీమియర్ ప్లాన్ వర్కవుట్ అయింది.
దీంతో నాలుగు రోజుల ముందే సినిమాను మీడియాకి చూపించి ఒకరోజు ముందే ప్రేక్షకులకు పెయిడ్ ప్రీమియర్స్ వేసే ప్లాన్ రెడీ చేస్తున్నారు. మీడియాకి సినిమా ముందే చూపించడం ద్వారా సినిమాకు కొంత పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే పెయిడ్ ప్రీమియర్ షో రెస్పాన్స్ తో ఓపెనింగ్స్ ఊపందుకునే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శాకుంతలం ను ముందే చూపించబోతున్నారట. మరో రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on April 9, 2023 10:54 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…