కొందరు హీరోలను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అస్సలు ఊహించుకోలేం. మాస్ రాజా రవితేజ కూడా ఆ కోవకే చెందుతాడు. ‘డిస్కో రాజా’ లాంటి కొన్ని సినిమాల్లో మాత్రమే రవితేజ పాత్రలో ప్రతినాయక ఛాయలు కనిపిస్తాయి. ఆ సినిమా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ సంగతి తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు మాస్ రాజా నుంచి వచ్చిన కొత్త సినిమా ‘రావణాసుర’లో తన పాత్రను చూసి జనాలు షాకైపోయారు.
సినిమాలో చివరి 20 నిమిషాల ముందు వరకు కూడా రవితేజ పాత్ర పూర్తి నెగెటివ్‌గా సాగుతుంది. అతను మరీ కర్కశంగా హత్యలు చేస్తాడు. రేప్‌లు కూడా చేస్తాడు. ముఖ్యంగా ఒక సన్నివేశంలో మేఘా ఆకాష్‌ను రేప్ చేసి.. ఆ తర్వాత గొంతు కోసి హత్య చేసినట్లు చూపిస్తారు. ఇలాంటి సన్నివేశాల్లో రవితేజను చూసి షాకవ్వని వాళ్లు ఉండరు. మామూలుగా స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోనూ ఇలాంటి సన్నివేశాల్లో చూసి ప్రేక్షకులు జీర్ణించుకోలేరు.
రవితేజ లాంటి అందరి ఆమోదం ఉన్న, నెగెటివిటీ లేని హీరోను ఇలాంటి సీన్లలో చూడటం పెద్ద షాకే. ఆ తర్వాత ఈ పాత్రలో ట్విస్ట్ ఉన్నప్పటికీ.. సినిమాలో చాలా వరకు పూర్తి నెగెటివ్‌గా సాగుతున్న క్యారెక్టర్‌ను చూస్తే ప్రేక్షకులకు అస్సలు మింగుడుపడదు. చివర్లో పాత్రలోని అసలు కోణం బయటికి వచ్చినా సరే.. అంతకుముందు చూసిన సీన్లు బలంగా ముద్ర వేసుకుపోతాయి. స్టార్ హీరోలను ఇంత నెగెటివ్‌గా చూపిస్తే.. ఇలాంటి సినిమాలు వర్కవుట్ కావడం కష్టమే. సినిమాకు డివైడ్ రావడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.
ఐతే ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. రవితేజ నెగెటివ్ షేడ్స్‌ను పండించిన విధానం మాత్రం అమోఘం. తాను రేప్ చేసిన చంపేసిన అమ్మాయి శవం ముందు వచ్చి అమాయకంగా పెర్ఫామెన్స్ ఇచ్చే సన్నివేశంతో పాటు సినిమాలో చాలా చోట్ల పెర్ఫామన్స్ అదరగొట్టాడు మాస్ రాజా. ఎంతైనా కెరీర్ ఆరంభంలో విలన్ పాత్రలు కూడా చేసిన అనుభవ ంఉంది కదా. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా సినిమాలో మళ్లీ ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేయాల్సి వచ్చినా రవితేజ ఇరగదీసేస్తాడనడంలో సందేహం లేదు.
This post was last modified on April 8, 2023 6:50 pm
ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…