అల్లు అర్జున్‌ను సోషల్ మీడియాలో ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఒకప్పుడు మెగా అభిమానులకు తనకిచ్చిన మద్దతును మరిచిపోయి, సొంత ఇమేజ్ కోసం తపిస్తుండటం, తన అభిమానులను కొత్తగా ఆర్మీ అని సంబోధించడం.. చిరు, పవన్‌ల పేర్లను ఇంతకుముందులా పెద్దగా ప్రస్తావించకపోవడం.. ఈ విషయాల్లో మెగా అభిమానుల్లోనే ఒక వర్గం బన్నీ మీద చాలా ఆగ్రహంతో ఉంది. వేదికల మీద బన్నీ మాట్లాడే కొన్ని మాటలు, పీఆర్ టీం అతడికి ఇచ్చే ఎలివేషన్ లాంటివి కూడా చర్చనీయాంశం అవుతుంటాయి.
ఈ విషయాలను పక్కన పెడితే.. సినిమా కోసం బన్నీ పడే కష్టం, మేకోవర్ల మీద అతను పెట్టే శ్రద్ధ, పాత్రల్లో అతను ఒదిగిపోయే తీరు మాత్రం ప్రశంసనీయం. లుక్స్ పరంగా కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొని.. ఆ తర్వాత తనను తాను గొప్పగా మలుచుకుని అందరి ఆమోదం పొందిన తీరు అభినందనీయం.
పాత్ర కోసం బన్నీ పెట్టే శ్రద్ధ ఎలాంటిదో ‘పుష్ప’లో ఇప్పటికే చూశాం. పూర్తిగా డీగ్లామరస్ రోల్‌లో ఎంత గొప్పగా ఒదిగిపోయాడో, ప్రేక్షకుల ఆమోదం ఎలా పొందాడో తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2 కోసం బన్నీ చూపిస్తున్న డెడికేషన్ కూడా చర్చనీయాంశం అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసి జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయంతే. ఇప్పటిదాకా ఇండియన్ ఫిలిం హిస్టరీలో స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరో చేయని సాహసం అతను చేశాడు. ఆడ వేషంలో హిజ్రా లాగా కనిపించాడు. చిత్తూరు జిల్లాలో గంగ జాతరలకు మగాళ్లు ఆడవేషం వేయడం అక్కడి సంప్రదాయం. సినిమాలో గంగ జాతర నేపథ్యంలో వచ్చే ఒక ముఖ్యమైన ఎపిసోడ్‌లో బన్నీ ఈ అవతారంలోనే కనిపించనున్నాడు.
ముందు ఈ లుక్‌ను సర్ప్రైజ్‌లా దాచిపెట్టి సినిమాలో ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇవ్వాలని అనుకున్నారు కానీ.. తర్వాత ఆలోచన మార్చుకున్న సుకుమార్ ఫస్ట్ లుక్‌గా దీన్నే రిలీజ్ చేశాడు. ఇది ప్రేక్షకులకు మామూలు షాక్ కాదు. ఎవ్వరూ ఇలాంటి లుక్‌ను ఊహించలేదు. ఒక సూపర్ స్టార్ నుంచి ఇలాంటి ఫస్ట్ లుక్ పెద్ద షాకే. ఇలాంటి సాహసం అందరూ చేయలేరు. అందుకే బన్నీ గట్స్‌కు హ్యాట్సాఫ్ అంటూ పాన్ ఇండియా స్థాయిలో అందరూ అతణ్ని కొనియాడుతున్నారు.
This post was last modified on April 8, 2023 6:43 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…