Movie News

పిక్ టాక్: ఇంతందం దారి మళ్లిందా!

‘ఊహలు గుసగుసలాడే’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది ఢిల్లీ భామ రాశి ఖన్నా. ఆమె అరంగేట్ర సినిమా చిన్నదే కానీ.. అది సాధించిన విజయం పెద్దదే. ఆ సినిమాలో ముగ్ధమనోహరంగా కనిపించిన రాశిని చూసి చాలామంది కుర్రాళ్లు ప్రేమలో పడిపోయారు. రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లకు భిన్నంగా కొంచెం బొద్దుగా, ముద్దుగా కనిపించిన రాశి.. కుర్రా కారు గుండెలకు బాగానే గాయం చేసింది. ఆ తర్వాత టాలీవుడ్లో ఆమెకు బాగానే అవకాశాలు వచ్చాయి.

‘బెంగాల్ టైగర్’ సహా కొన్ని సినిమాల్లో సూపర్ సెక్సీగానూ కనిపించి గ్లామర్ ప్రియులనూ ఆకట్టుకుందామె. ‘తొలి ప్రేమ’ సినిమాతో పెర్ఫామర్‌గానూ తనేంటో రుజువు చేసుకుంది. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె కెరీర్ మరో స్థాయికి వెళ్తుందని.. టాప్ హీరోల సరసన కూడా అవకాశాలు పట్టేస్తుందని అంచనా వేశారు ఇండస్ట్రీ నిపుణులు.

కానీ ఆశ్చర్యకరంగా రాశి కెరీర్ తిరోగమనంలో పయనించింది. టాలీవుడ్లో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. పెద్ద రేంజికి వెళ్తుందనుకున్న హీరోయిన్ కాస్తా.. తెలుగులో అసలు అవకాశాలే లేని స్థాయికి రావడం రాశి అభిమానులను బాధించే విషయమే. రాశి కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టి తొమ్మిదేళ్లు పూర్తి కావస్తుండగా.. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆమె అందం, ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న తీరు చూసి ఆశ్చర్యపోవాల్సిందే. కెరీర్లో ఒక దశ వరకు బొద్దుగా ఉందన్న విమర్శలకు సమాధానం చెబుతూ.. మధ్యలో బరువు కూడా తగ్గింది. ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిజిక్‌తో మెస్మరైజింగ్‌గా కనిపిస్తోంది.

రాశి ఇతర భాషల్లో చేస్తున్న పాత్రలు, ఆమె అప్పీయరెన్స్ చూసి తెలుగు ప్రేక్షకులు ఒకింత విచారిస్తున్నారు. ముఖ్యంగా ‘ఫర్జీ’ సిరీస్‌లో అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది రాశి. ఆమెను అలాంటి పాత్రల్లో చూసి ఇంతందం దారి మళ్లిందే.. అని తెలుగు ప్రేక్షకులు ఫీలయ్యే పరిస్థితి. తాజాగా ఒక ప్రైవేటు కార్యక్రమంలో పింక్ కలర్‌ టాప్‌ డ్రెస్సులో రాశి మెరిసిపోయిన తీరు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇలాంటి కథానాయికను సరిగా ఉపయోగించుకోనందుకు టాలీవుడ్ దర్శక నిర్మాతల మీద కోపం వస్తోంది ఆమె అభిమానులకు.

This post was last modified on April 8, 2023 6:41 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

2 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

3 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

3 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

6 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

8 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

8 hours ago