గత వారం వచ్చిన ‘దసరా’ సినిమా వేసవి సీజన్‌కు ఘనమైన ఆరంభాన్నే ఇచ్చింది. ఇక ఈ వారం ఒకటికి రెండు సినిమాలు బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి సీనియర్ హీరో రవితేజ నటించిన ‘రావణాసుర’ కాగా.. ఇంకోటి యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్ర పోషించిన ‘మీటర్’. ఇందులో ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేది ‘రావణాసుర’నే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ రవితేజ అంటే పక్కా మాస్ మసాలా సినిమాలకు ప్రసిద్ధి. ఆయన కొంచెం రూటు మార్చి వైవిధ్యమైన కథలు ప్రయత్నిస్తే చాలా వరకు బెడిసికొట్టాయి. అయినా సరే.. ‘రావణాసుర’తో కొంచెం భిన్నమైన ప్రయత్నమే చేసినట్లున్నాడు. టైటిల్‌కు తగ్గట్లే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు రవితేజ ఇందులో.
టీజర్, ట్రైలర్ చూస్తే ‘రావణాసుర’ కథ మీద ఒక అంచనాకు రాలేని పరిస్థితి. కథేంటో పూర్తిగా అర్థం కాలేదు. దీన్ని సస్పెన్సులా దాచి ఉంచింది చిత్ర బృందం. మరి థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకుడికి ఏం వడ్డించబోతున్నారన్నది ఆసక్తికరం. తొలి చిత్రం ‘స్వామి రారా’ తర్వాత హిట్టు రుచే ఎరుగని సుధీర్ వర్మకు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. చాన్నాళ్లు నిర్మాణానికి దూరంగా ఉన్న అభిషేక్ నామాతో పాటు రచయిత శ్రీకాంత్ విస్సా కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు. మరి ‘రావణాసుర’ వీళ్లందరికీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
ఇక ‘మీటర్’ సినిమా విషయానికి వస్తే.. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుపోతున్న కిరణ్ రెడ్డికి కూడా ఇది సక్సెస్ కావడం అత్యావశ్యకం. దీని ట్రైలర్ చూస్తే మాత్రం సగటు మాస్ మసాలా సినిమాలా కనిపించింది. ‘దసరా’ ఇంకా బాగానే ఆడుతుండగా.. ‘రావణాసుర’ పోటీని కూడా తట్టుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ‘మీటర్’కు అంత తేలిక కాదు. కానీ కిరణ్ అండ్ కో చాలా ధీమాగా ఉన్నారు. కొత్త దర్శకుడు రమేష్ కడూరి ఈ చిత్రాన్ని రూపొందించాడు. మరి సీనియర్ వెర్సస్ జూనియర్ బాక్సాఫీస్ పోరులో ఎవరెలాంటి ఫలితాన్నందుకుంటారో చూడాలి.
This post was last modified on April 7, 2023 10:19 am
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…