క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తన కెరీర్ లో దేనికి చేసుకోనంత మార్కెటింగ్ మార్చి 22న విడుదలైన రంగమార్తాండకు జరిపారన్నది కాదనలేని వాస్తవం. సెలబ్రిటీలను తీసుకొచ్చి వరసగా షోలు వేసి వాళ్ళతో వీడియో బైట్లు తీసుకుని పబ్లిసిటీ చేసుకున్నారు. సోషల్ మీడియా ప్రముఖులను పిలిపించి వాళ్ళ ద్వారా పోస్టులు ట్వీట్లు వైరల్ చేయించారు. అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. సినిమా అద్భుతంగా ఉందని గొప్పగా పొగిడారు. కొందరు ఏకంగా కెమెరాల ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. బరువైన భావోద్వేగాలను నిజంగానే చాలా మందిని కదిలించిన మాట వాస్తవం.
ఇదంతా చూశాక ఆడియన్స్ థియేటర్లకొచ్చి చూస్తారని కృష్ణవంశీతో పాటు అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. ఆన్ లైన్ లో జరిగిన ప్రచారానికి బాక్సాఫీస్ వద్ద నమోదైన కలెక్షన్లను పొంతన కుదరలేదు. మొదటి రెండు మూడు రోజులు కొంత హడావిడి కనిపించినా ఆ తర్వాత హఠాత్తుగా పడిపోయింది. పోటీగా ఉన్న దాస్ కా ధమ్కీ సైతం యావరేజ్ గా నిలిచినప్పటికీ అదేమీ రంగమార్తాండకు ఉపయోగపడలేదు. కేట్ చేస్తే రెండు వారాలు దాటడం ఆలస్యం నిన్న అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో రంగమార్తాండ స్ట్రీమింగ్ మొదలుపెట్టేసింది.
ఒకరకంగా పధ్నాలుగు రోజులకే ఇలా ఓటిటిలో వదిలేయడం మంచి నిర్ణయమే. అధిక శాతం ప్రేక్షకులు చూసేందుకు అవకాశం ఉంటుంది. ఆసక్తి తగ్గిపోయేదాకా లేట్ చేయడం కంటే ఇదే ఉత్తమం. బడ్జెట్ వసూళ్లు లెక్కలు గట్రా ఎలా ఉన్నా ప్రైమ్ రంగమార్తాండకు దాని మార్కెట్ కి మించిన భారీ మొత్తాన్నే ఆఫర్ చేసి హక్కులు కొనుగోలు చేసిందట. కాకపోతే థియేటర్ రిలీజ్ కంపల్సరీ అనే కండీషన్ పెట్టడం వల్లే వర్కౌట్ కాదని అనిపించినా కృష్ణవంశీ రిస్క్ చేశారని ఇన్ సైడ్ టాక్. ఉరుము లేని పిడుగులా ఈ మధ్య ఓటిటి రిలీజులు ఇలా ట్విస్ట్ ఇస్తున్నాయి.
This post was last modified on April 7, 2023 9:34 am
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…