Movie News

ఏజెంట్ అభిమానులకు టెన్షన్ తీరింది

అక్కినేని అభిమానులు గంపెడాశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న ఏజెంట్ విడుదల ఈ నెల 28న ఉంటుందా లేదానే అనుమానాలకు పూర్తిగా చెక్ పడిపోయింది. ఖచ్చితంగా అదే డేట్ కి రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అఖిల్ స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషనల్ ఇంటర్వ్యూలు మొదలుపెట్టేశాడు. ఈ మధ్య అందరూ ఫాలో అవుతున్న ట్రెండ్ ప్రకారం ముందు యాంకర్ సుమతో ముఖాముఖీ ద్వారా దీనికి బోణీ చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో విపరీతమైన ఒత్తిడి మధ్య బిజీగా ఉండటంతో ఇప్పుడప్పుడే జాయినయ్యే ఛాన్స్ లేదు.

నిర్మాత అనిల్ సుంకర రాబోయే ఇరవై రోజులకు తగ్గట్టు పబ్లిసిటీని భారీగా ప్లాన్ చేశారట. ముఖ్యంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో ఇంత భారీ బడ్జెట్ తో తీసిన ఏజెంట్ కి ఆ స్థాయి బజ్ లేదన్నది వాస్తవం. దాన్ని పెంచే దిశగా ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ప్రణాళికను సిద్ధం చేశారు. దసరా కోసం నాని, శాకుంతలం కోసం సమంతా దేశమంతా ఎలా తిరిగారో కష్టపడ్డారో చూశాం. ఇప్పుడు అఖిల్ అంతకుమించి రౌండ్లు కొట్టాల్సి ఉంటుంది. అసలే పొన్నియన్ సెల్వన్ 2 అదే రోజు వస్తూ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏజెంట్ ఓపెనింగ్స్ కి ఎసరుపెట్టేలా ఉంది.

ఇప్పటిదాకా వచ్చిన ఏజెంట్ పాటలు బాగానే ఉన్నా మరీ ఛార్ట్ బస్టర్ రేంజ్ కి చేరుకోలేదు. సినిమాలో కీలక పాత్ర పోషించిన మమ్ముట్టి డేట్ల అందుబాటు కూడా అఖిల్ బృందానికి సమస్యగా మారిందట. ఒకేసారి నాలుగైదు సినిమాలతో ఎప్పుడో షూటింగ్స్ లో బిజీగా ఉండే ఆయన్ను మహా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తప్ప ప్రతిచోటా తిప్పలేని పరిస్థితి. అందుకే భారం మొత్తం అఖిల్ మీద సోలోగా ఉండనుంది. ఇంకో పాట చిత్రీకరణ బ్యాలన్స్ ఉందన్నారు కానీ సాధ్యమైతే పూర్తి చేయడమో లేదా అది లేకుండానే థియేటర్లకు వదిలేయడమో చేస్తారు. చూద్దాం

This post was last modified on April 7, 2023 9:30 am

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

2 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

3 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

3 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

3 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

6 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

6 hours ago