‘దసరా’ విడుదలకు చాలా రోజుల ముందే ఈ చిత్రం గురించి నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప తరహాలో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అద్భుతాలు చేస్తుందని నాని స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘దసరా’ గురించి నాని మరీ ఎక్కువ చేసి చెబుతున్నాడనే అభిప్రాయాలు అప్పుడు వ్యక్తం అయ్యాయి. తర్వాత నాని దగ్గర మీడియా వాళ్లు ఇదే విషయం ప్రస్తావిస్తే.. సినిమా మీద తనకున్న కాన్ఫిడెన్స్‌తోనే ఈ కామెంట్స్ చేశానని.. దసరాకు అన్నీ కలిసొస్తే పాన్ ఇండియా లెవెల్లో మ్యాజిక్ జరుగుతుందని అన్నాడు.
ఐతే రిలీజ్ తర్వాత ఈ చిత్రం తెలుగు వరకు అదరగొట్టింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ‘దసరా’ మోత మామూలుగా లేదు. దిల్ రాజు రూ.9 కోట్లకు సినిమాను కొని రిలీజ్ చేస్తే.. ఏకంగా రూ.20 కోట్ల షేర్ మార్కును టచ్ చేసింది. ఏపీలో సినిమా కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తున్నా.. ఓవరాల్‌గా సంతృప్తికర ఫలితమే వచ్చింది.
కానీ తెలుగేతర భాషల్లో ‘దసరా’ పెద్దగా సౌండ్ చేయలేకపోయింది. ఉత్తరాది సంగతి పక్కన పెడితే.. దక్షిణాదిన ఇతర భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయినట్లు కూడా అనిపించలేదు. తమిళంలో గత వారాంతంలో పత్తు తల, విడుదలై లాంటి పేరున్న సినిమాలు రిలీజ్ కావడంతో నాని మూవీకి మినిమం థియేటర్లు దక్కలేదు. మలయాళం, కన్నడలో కూడా సినిమా నామమాత్రంగా రిలీజైంది. ఈ భాషల్లో ‘దసరా’ గురించి జనాలు అస్సలు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. వసూళ్ల గురించి అసలు చర్చే లేదు. ఉత్తరాదిన పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నట్లే ఉంది.
నార్త్‌లో హిందీ వెర్షన్ మూడు కోట్లకు కొంచెం ఎక్కువగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అది కూడా అఫీషియల్ నంబర్ కాదు. బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు ‘దసరా’ గురించి ట్వీట్లు కూడా వేయలేదు. కలెక్షన్ల వివరాలు కూడా ప్రకటించలేదు. అంటే నార్త్‌లో సినిమా పెద్దగా ప్రభావం చూపలేదని అర్థమవుతోంది. ఐతే తెలుగు వరకు సినిమా అంచనాలను మించడం, నాని మార్కెట్ స్థాయిని పెంచడం సానుకూల అంశం.
This post was last modified on April 7, 2023 8:27 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…