పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటి ఫినిష్ చేసే దూకుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే వినోదాయ సీతం రీమేక్ టాకీ కంప్లీట్ చేసేశాడు. తాజాగా హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో జాయిన్ అయిపోయాడు. ఈ సినిమాకు సంబంధించి ఒకటి రెండు షెడ్యూల్స్ తర్వాత సుజీత్ OG సినిమాకు డేట్స్ ఇవ్వబోతున్నాడు. ఇలా తన లైనప్ లో ఉన్న అన్నీ సినిమాలకు డేట్స్ ఇస్తూ ప్లాన్ చేసుకుంటున్న పవన్ హరి హర వీరమల్లు ను మాత్రం పట్టించుకోవడం లేదు.
క్రిష్ దర్శకత్వంలో పవన్ మొదటి పాన్ ఇండియా మూవీగా ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతుంది. పవన్ రీ ఎంట్రీ ఇద్దామని ఫిక్స్ అయిన టైమ్ లో ముందుగా ఒకే చేసుకున్న కథల్లో ఇదొకటి. పీరియాడిక్ హిస్టారికల్ ఫిక్షనల్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కానీ మధ్యలో పవన్ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల మరికొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఆ మధ్య పవన్ ఓ షెడ్యూల్ చేసే సరికి ఇక ఈ సినిమాను కంప్లీట్ చేశాకే మరో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు క్రిష్ తర్వాత ఎనౌన్స్ అయిన ప్రాజెక్ట్స్ థియేటర్స్ లోకి వచ్చేశాయి, మరికొన్ని అనుకోకుండా సెట్స్ పైకి వచ్చేసి కంప్లీట్ కూడా అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీలో అంతా అయ్యో పాపం క్రిష్ అనుకుంటూ పవన్ తో ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడేంటి ? అని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా పవన్ మిగతా సినిమాలతో పాటు హరి హర వీరమల్లు కి కూడా మధ్యలో డేట్స్ ఇస్తే కొంత కొంత ఘాట్ పూర్తవుతుంది. లేదంటే ఎన్నేళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. పవన్ ఈ విషయం ఆలోచించుకోవాల్సిందే.
This post was last modified on April 6, 2023 7:04 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…