టాలీవుడ్ లో ఓ మంచి ఒరవడి ఉంది. తమ బేనర్ , తమకి సంబంధం లేకపోయినప్పటికీ కొన్ని ఉత్తమ సినిమాలను మెచ్చుకుంటూ ఆ టీంను సన్మానించడం చాలా సార్లు చూశాం. ముఖ్యంగా అల్లు అరవింద్ ఇలాంటి విషయాలో అందరికంటే ముందుంటారు. ‘శతమానం భవతి’ , ‘మహానటి’ సినిమాల రిలీజ్ తర్వాత టీం అందరినీ పిలిచి ఓ పార్టీ ఏర్పాటు చేసి, ఈవెంట్ నిర్వహించి వారిపై ప్రశంసలు కురిపించారు అల్లు అరవింద్. ఎలాంటి ఇగో లేకుండా అలా సన్మానించడంతో అల్లు మంచి మనసు గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు.
ఇప్పుడు దిల్ రాజు బేనర్ నుండి ‘బలగం’ అనే చిన్న సినిమా వచ్చింది. ఈ సినిమాకు నలుమూలల నుండి అభినందనలు, ప్రశంసలు దక్కాయి. దక్కుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ జనాలు కూడా ఈ సినిమా బృందాన్ని సన్మానించారు. ముఖ్యంగా చిరంజీవి తన భోళా శంకర్ సెట్స్ కి పిలిపించుకొని మరీ సన్మానించారు. ఆ తర్వాత మంచు మోహన్ బాబు మరికొందరు కూడా దర్శకుడు వేణును టీంను మెచ్చుకుంటూ సన్మానించారు.
అయితే బలగం విషయంలో అల్లు అరవింద్ మాత్రం కాస్త దూరంగా ఉండిపోయారు. ఈ చిన్న సినిమా సాదించిన పెద్ద విజయం గురించి ఎక్కడా మాట్లాడలేదు అల్లు. ఈ సినిమా టీంను ఎప్పటిలానే పిలిచి సన్మానించలేదు. దీనికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఇటీవలే విజయ్ దేవరకొండ , పరశురామ్ కాంబో సినిమాను తమకి చెప్పకుండా దిల్ రాజు ఎనౌన్స్ చేశారని అల్లు అరవింద్ బాగా ఫీలయ్యారని ఓ న్యూస్ బయటికొచ్చింది. బహుశా అందుకే బలగం కి సంబంధించి అల్లు సైలెంట్ అయ్యారనిపిస్తుంది. ఈ సినిమా టీంను అల్లు అరవింద్ మెచ్చుకోకపోవడం ఎప్పటిలా ఓ సన్మానం ఏర్పాటు చేయకపోవడంతో అల్లుకి దిల్ కి మధ్య చెడిందని అర్థమవుతుంది.
This post was last modified on April 6, 2023 6:58 pm
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…