రామ్ చరణ్ -శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ కి సంబంధించి ఇంత వరకూ ఒక్క ఫస్ట్ లుక్ మాత్రమే బయటికొచ్చింది. ఈ సినిమా విషయంలో శంకర్ ఓ ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు. ఎప్పుడు ఏ కంటెంట్ వదలాలి అనేది శంకర్ చేతిలోనే ఉంది. అయితే ఈ సినిమాకు ఇంత వరకూ రావలసిన భారీ హైప్ రాలేదనే చెప్పాలి. లీకుల ద్వారా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నా ఓ భారీ పాన్ ఇండియా సినిమాకు ఉండే క్రేజ్ దీనికి కనిపించడం లేదు.
అయితే తాజాగా దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్స్ గురించి ఓ విషయం చెప్పారు. సినిమాలో ఒక్కో సాంగ్ కి 10 కోట్లు అవుతుందని తెలిపారు. జస్ట్ ఒక్క సాంగ్ బయటికొస్తే చాలు వావ్ అంటారు అని చెప్పుకున్నారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజు చెప్పిన మాటకు సంతోషపడిపోతున్నారు. నిజానికి శంకర్ టేకింగ్ వేరు , ఆయన మేకింగ్ స్టైల్ వేరు. ప్రతీ ఫ్రేమ్ రిచ్ గా ఉంటుంది. గ్రాండియర్ విజువల్స్ తో ఆయన తీసే సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. గేమ్ ఛేంజర్ విషయంలోనూ అదే జరగనుందని అర్థమవుతుంది.
ఇక ఫస్ట్ లుక్ కి ఆశించిన రెస్పాన్స్ దక్కలేదు కానీ ఫస్ట్ సింగిల్ , టీజర్ గ్లిమ్స్ లాంటివి బయటికొస్తే దిల్ రాజు చెప్పినట్టు ప్రేక్షకులంతా వావ్ అంటారేమో చూడాలి. పొలిటికల్ రీవెంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అన్నీ కుదిరితే సంక్రాంతి కి థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
This post was last modified on April 6, 2023 6:41 pm
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…